బాడీ లాస్ కోసం ప్రయత్నిస్తే మైండ్ లాస్ అయినట్టుంది అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. లోకేష్ చాలా అమాయకంగా మాట్లాడుతున్నాడు.. వెయ్యి కోట్ల పెట్టుబడితో ఉన్న పరిశ్రమలు ప్రారంభించటానికి తన తండ్రికి టైం ఉండేది కాదని లోకేష్ అంటున్నాడు.. బాడీ లాస్ కోసం ప్రయత్నించి లోకేష్ కు మైండ్ లాస్ అయ్యినట్టు ఉంది అని ఎద్దేవా చేశారు.. అన్ని…
ఏపీలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీపై ఆరోపణలు చేశారు. టీడీపీకి రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బిజినెస్ ర్యాంకులపై టీడీపీ విమర్శలు చేస్తోందని.. మళ్లీ అధికారంలోకి రావాలన్న తాపత్రయం మినహా టీడీపీకి మరో ఆలోచన లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. నాలుగు పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్లు పెట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు…
పెట్టుబడి దారులకు అనువైన వాతావరణం ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా ఉందన్నారు మంత్రి అమర్‌నాథ్… దావోస్ టూర్ పై విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన పరిశ్రమలశాఖ మంత్రి అమర్ నాథ్… వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంటే మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, సామర్థ్యం, పాలసీలను వెల్లడించడానికి ఒక ఫ్లాట్ పామ్ అన్నారు.. అయితే, అక్కడ నుంచి లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చామని గత ప్రభుత్వాలు చేసింది దుష్ప్రచారమేనని కొట్టిపారేశారు. కరోనా వల్ల రెండేళ్లుగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకునే అవకాశం రాలేదని ఆవేదన…
విశాఖపట్నంలో ఫైబర్ నెట్ కార్యాలయాన్ని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవల్ని అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్‌ను మరింత ఆధునీకరించడం జరిగిందని అన్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా అతి తక్కువ ధరకు మూడు సర్వీసుల్ని అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. Read Also: Etela Rajender: ప్రాణహిత-చేవెళ్లకు అడ్డుపడింది…
ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించకపోయినా.. అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రంలో రోడ్లు, కరెంట్ పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి.. కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇక, ఇవాళ ప్రగతి భవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్ కుటుంబాన్ని కలిసిన మంత్రి ఆర్కే రోజా.. ఆ తర్వాత కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు.. ఏపీ గురించి కేటీఆర్ మాట్లాడలేదు అనుకుంటున్నా.. పొరుగు రాష్ట్రం అన్నారు.. ఆంధ్రప్రదేశ్ కాదు అనుకుంటానన్నారు.…
కేటీఆర్ వ్యాఖ్యలపై వరుసగా స్పందిస్తున్నారు ఏపీ మంత్రలు.. ఢిల్లీలో మీడియాతో మట్లాడిన మంత్రి అమర్‌నాథ్.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్రం గురించి కాదను కుంటా అంటూనే కౌంటర్ ఇచ్చారు.. ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడితే, కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్సులు పంపుతాం అంటే, పంపండి.. మేం కూడా పంపిస్తాం అన్నారు.. ఏపీకి వచ్చి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి చూడండి, వాలంటైర్ వ్యవస్థ చూడండి, గ్రామ సచివాలయ వ్యవస్థను చూడండి, గాంధీజీ…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రతిపాదన చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కలిసి ముందు సాగితే బాగుంటుందనే ప్రతిపాదన తీసుకొచ్చారు.. అయితే, వైసీపీ, కాంగ్రెస్ దోస్తీ విషయంలో ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై ఘాటుగా స్పందించారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు పుట్టిందే వైసీపీ అన్న ఆయన.. వ్యూహకర్తలు సలహాలు ఇస్తారు.. కానీ, అమలు చేయాలో లేదో నిర్ణయం…