Gudivada Amarnath: తెలుగు రాష్ట్రాల్లో భూముల ధరలు ఇప్పుడు రెండు రాష్ట్రాల నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీస్తున్నాయి.. తెలంగాణలో ఎకరం భూమి అమ్మి ఏపీలో 50 నుంచి 100 ఎకరాలు భూమి కొంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అన్న ఆ మాటలను ఇప్పుడు కేసీఆర్ ఉటంకించారు. ఏపీలో సీఎం జగన్ వల్ల సంపద నాశనం అయిపోయిందని, భూముల రేట్లు పడిపోయాయని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు.. గతంలో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో నాలుగైదు ఎకరాలు కొనేవాళ్లని, జగన్ వచ్చాక పరిస్థితి తారుమారైందని విమర్శించిన ఆయన.. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితో ఆంధ్రాలో 50 ఎకరాలు వస్తుందని.. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా వంద ఎకరాలు కూడా కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు.. అయితే, తాజాగా చంద్రబాబు మాటలను పటాన్‌చెరు పర్యటనలో భాగంగా కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు..
Read Also: TS Govt :ఉద్యోగులు, పింఛనర్లకు గుడ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం..
ఇప్పటికే ఓసారి తెలంగాణలో, ఏపీలో భూముల ధరలపై హాట్ కామెంట్లు చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఈ వ్యవహారంలో మరోసారి స్పందించారు.. ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్యుతాపురం వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందన్నారు.. ఏపీలో భూముల విలువలు తగ్గాయని చంద్రబాబు, కేసీఆర్‌కు చెప్పరంటా అని ఎద్దేవా చేసిన ఆయన.. ఒకసారి అచ్యుతాపురం కేసీఆర్ వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందని సూచించారు.. అచ్యుతాపురంలో ఎకరా అమ్మితే తెలంగాణలో 150 ఎకరాల కొనవచ్చని చెబుతూ కేసీఆర్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు.. ఇక, గడప గడపకు వెళ్లకపోతే ఎమ్మెలే సీట్లు ఉండవని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.. అంత దైర్యంగా చెప్పిన నేత మరొకరు లేరన్నారు అమర్నాథ్.. టీడీపీ నేతల భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు.. వారు ప్రజల భవిష్యత్తుకు ఏమి గ్యారెంటీ ఇస్తారు? అని ప్రశ్నించారు. కేజీ బంగారం, బెంజ్ కారు అంటూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తారు.. సీఎం విజయాన్ని అడ్డుకునే సత్తా చంద్రబాబు ఆయన దత్త పుత్రుడు పవన్ కల్యాణ్‌కు లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.