Buddha Venkanna: కాపులు వంద శాతం పవన్ కల్యాణ్‌కే ఓటేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంత్రి గుడివాడ అమర్నాథ్ తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు.. అసలు అమర్నాథ్ వన్ టైం ఎమ్యెల్యే అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, చంద్రబాబు ఇంటి గేటును టచ్ చేస్తే రాష్ట్రం నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు బుద్ధా వెంకన్న.. పోలీసులుతో కాకుండా మీ పార్టీ పిచ్చికుక్కలను తీసుకుని వచ్చి చూడండి అప్పుడు మీ సంగతి తేలుస్తామన్న ఆయన.. చంద్రబాబు అద్దె ఇంటిని అటాచ్ చేసి ఘనత సాధించామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.. ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస సంహారం జరగడం ఖాయం అంటూ జోస్యం చెప్పారు వెంకన్న.. రాయలసీమలో యువగళం పాదయాత్రతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గండేల్లో పిడుగులు పడుతున్నాయన్నారు.. చంద్రబాబు తర్వాత పార్టీ బాధ్యతలు యువనాయకుడివే అన్నారు.. ఇక, పచ్చ కామెర్ల వచ్చినవాళ్లకు లోకం అంతా పచ్చగా కనిపిస్తోందంటూ మండిపడ్డారు బుద్ధా వెంకన్న .
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
కాగా, పార్టీ పెట్టి సీఎం అవ్వడం అంటే మూడు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కన్నంత ఈజీ కాదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. పార్టీని నదపలేనని పవన్ చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేసిన ఆయన.. ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీ జెండా మోయడమే ఆయన పని అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు దగ్గర ఎంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అని మొదటి నుంచి చెబుతున్నామని.. ఇప్పుడు అదే నిజమైందన్నారు. సినిమా రంగంలో ఉండకుండా.. నీకెందుకు రాజకీయాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వెంకన్న.