సిద్దిపేట జిల్లా సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్నేహిత మహిళా సహకర కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు, సిద్దిపేట సిపి స్వేత ప్రారంభించారు. పోలీస్, పొలిటికల్, జర్నలిస్టులు వాళ్ళు పండుగ, సెలవులు లేకుండా తమ పిల్లలను, ఆరోగ్యాన్ని పక్కన పెట్టీ నిరంతరం పని చేస్తారని ప్రశంసించారు.
సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్‌గా రవీందర్ సింగ్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. తనకు ఇంతటి కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఋణపడి ఉంటానని రవీందర్ సింగ్ అన్నారు.
మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసు ఇచ్చింది. ఢిల్లీలో అరెస్ట్ అయిన శ్రీనివాస్ వ్యవహారంలో నోటీసులో పేర్కొంది. మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో సీబీఐ శ్రీనివాసుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ ని సీబీఐ అరెస్ట్ చేసింది.
2022-23 వానాకాలం ధాన్యం సేకరణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి గంగుల కమలాకర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణలో పంటలు బాగా పండాయన్నారు.. 24 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 1 కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని.. తెలంగాణ రైతు పండించిన ప్రతీ గింజా కొంటామని స్పష్టం చేశారు.. ఈ సీజన్‌లో 112 లక్షల మెట్రిక్ ధాన్యం కొనుగోలు అంచనా వేశామని.. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు…
తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గంగుల కమలాకర్ ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యం సీఎంఆర్‌లో రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎఫ్‌సీఐ సహకరించాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. అంతేకాకుండా ఇక్కడి వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రైతుల్ని ఇబ్బంది పెట్టవద్దని, గన్నీలు, గోదాములు, ర్యాకుల కేటాయింపు పెంచాలని ఆయన విన్నవించారు. ప్రతీ నెల 9 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోవాలని ఆయన అన్నారు.…
యాసంగిలో పండించిన ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయ తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఒక్కొక్క కోనుగోలు కేంద్రాలు దగ్గర నోడల్ ఆఫీసర్, మిల్లులు దగ్గర ఒక ఆఫీసర్ ఉంటారని ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో 36 లక్షలు ఎకరాలలో సాగు జరిగిందని, 65 లక్షలు మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు.…
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట టీఆర్ఎస్ నాయకులు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ కామెంట్స్ మాట్లాడుతూ.. కేంద్రం తీరు దున్నపోతులాగా ఉందని ఆయన మండిపడ్డారు. అందుకే దానిపై వర్షం కురిపించి నిరసన తెలుపుతున్నామన్నారు. తెలంగాణలో ప్రజలు భారతీయులు కాదా? తెలంగాణ భారత దేశంలో అంతర్భాగం కాదా? మేమేమన్నా విదేశీయులమా? అని ఆయన ప్రశ్నించారు. ధాన్యం కొనాలని అడగడం మా హక్కు. మీ మెడలు వంచైనా ధాన్యం కొనెలా ఒత్తిడి…