ఏపీలో విజయనగరం పాలిటిక్స్ వెరైటీగా వుంటాయి. అక్కడ వైసీపీ నేతలు ఒకరితో ఒకరు పోటీపడుతుంటారు. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యే కోలగట్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డా వైసీపీ నేత పిల్లా విజయ్ కుమార్. పార్టీకి మొదటి నుంచి సేవలు అందిస్తున్న మమల్ని ఎమ్మేల్యే పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స రాష్ట్ర స్థాయి నాయకుడు ఆయన వెంట నడిస్తే పార్టీలో పక్కన పెడతారా? అని పిల్లా ప్రశ్నించారు.
పార్టీలో మా స్థానం ఏంటి ? పార్టీలో మేము ఉన్నట్టా ? లేనట్టా ? ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఒంటెద్దు పోకడలకు పోతున్నారు. దందాలకు అవినీతికి అడ్డాగా ఎమ్మెల్యే మారుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే వ్యవహార శైలిని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాలు ఇన్చార్జ్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ను కలిసి తనకి తన అనుచరులకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రం అందజేస్తాం అన్నారు.
విజయనగరం ఎమ్మెల్యే వ్యవహార శైలి తమను ఎంతో బాధిస్తోంది. ఆయన మాదిరి పార్టీలు మార్చకుండా ఒకే పార్టీని నమ్ముకున్నాం. మంత్రి బొత్స అనుచరులుగా పార్టీ అభివృద్ధికి పని చేస్తున్నాం. భూ దందాలు, అవినీతి అక్రమాలకు పాల్పడే ఎమ్మెల్యేపై ఎదురు తిరుగుతున్నామన్న దురుద్దేశంతో పార్టీ వ్యవహారాలకు మమ్మల్ని దూరం చేస్తున్నారా? అని పిల్లా ప్రశ్నించారు.
Loan Apps: లోన్ యాప్స్ యమా డేంజర్.. వాటి జోలికి పోవద్దు
ఈ ఎమ్మెల్యేకు అవినీతి, భూ దందాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల అభ్యున్నతి కోసం ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి విజయనగరం నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల్లో బీసీలకు కేటాయించాలి. ఈ నియోజకవర్గంలో 80శాతం మంది బీసీ ఓటర్లు ఉంటే కేవలం 20 శాతం మంది ఓటర్లు ఉన్న ఓసీలకు ఈ నియోజకవర్గాన్ని ఎందుకు కేటాయిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇక నుంచి బీసీ నినాదమే మా నినాదం, ఎమ్మెల్యే చేసిన ప్రతి పనికి ప్రతి చర్య ఉంటుందని హాట్ కామెంట్స్ చేశారు.