Botsa Satyanarayana: 2014లో పెళ్లి.. విడాకులు తీసుకొని మళ్లీ కలిశారు.. టీడీపీ-జనసేనపై మంత్రి సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: 2014లో పెళ్లి అయ్యింది.. విడాకులు తీసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ కలిశారు అంటూ టీడీపీ-జనసేన పొత్తులపై సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రాకు ఏమి చేశారు..? అని నిలదీసిన ఆయన.. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా?రాజరికం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అసలు పుంగనూరులో గొడవ ఎందుకు జరిగింది? అని నిలదీశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని కలలు కనమనండి అని సూచించారు. దొంగలముఠా మరల వస్తుంది.. ప్రజలు నమ్మొద్దు.. విశాఖ రాజధానికి ఎన్నో అడ్డంకులు కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఇక, లోకేష్ యువగళం పాదయాత్ర పై మంత్రి బొత్స హాట్ కామెంట్స్ చేశారు.. రాజకీయాల్లో కావాల్సింది రెడ్ బుక్ కాదు.. బ్లూ బుక్ కావాలని హితవుపలికారు. ఏమి చేసినా చట్టబద్ధంగా ఉండాలి.. ఎక్కడ యువగళం పాదయాత్రను అడ్డుకోలేదన్నారు. పిల్లాడు లోకేష్ ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు అని దుయ్యబట్టారు. 2014లో చంద్రబాబు మేనిఫెస్టో అసలు అమలు చేశారా? అని ప్రశ్నించారు.
దయచేసి విధుల్లోకి రండి..
దయచేసి విధుల్లోకి రండి అంటూ అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. వైసీపీ ప్రభుత్వం మీకు వ్యతిరేకం కాదు. మీ డిమాండ్లపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారు. ముఖ్యమంత్రి మహిళా పక్షపాతన్న ఆయన.. గుజరాత్ రాష్ట్రంలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో అంగన్‌వాడీలకు గ్రాట్యువీటి లేదు. గ్రాట్యువీటిలో కేంద్ర ప్రభుత్వానిది 50 శాతం వాటా. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నాం. అంగన్వాడీలకు ఇచ్చే ఫైనల్ సెటిల్మెంట్ ను పెంచుతున్నాం.. ఈ నిర్ణయం ఈ నిమిషం నుంచే అమలులోకి తెస్తున్నాం అని ప్రకటించారు. వారు 11 డిమాండ్లు ఇచ్చారు.. అందులో కొన్ని కేంద్రంతో ముడిపడిన అంశాలు.. వాటిపై కేంద్రం నుంచి వివరాలు కోరాం వారు స్పందించిన వెంటనే నిర్ణయం తీసుకుంటాం అన్నారు. అంగన్వాడీలకు భీమా 100 శాతం అమలు చేస్తాం.. దీనిపై ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అంగన్వాడీల పదవి విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నాం అని వెల్లడించారు మంత్రి బొత్స.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
2017 నుంచి ఇప్పటి వరకూ ఉన్న టీఏ, డీఏలు పెండింగ్లో ఉన్నాయి.. ఇప్పటి నుంచి ఆ అలవెన్స్ లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు మంత్రి బొత్స.. అంగన్వాడీలు వాడుతున్న యాప్స్ ను కుదిస్తాం.. ఒకటి లేదా రెండు యాప్స్ లో అన్ని అంశాలు తీసుకొస్తాం అన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ అంగన్వాడీ జీతం ఇస్తాం అన్నాం.. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే చేశామని గుర్తుచేశారు. కానీ, వారు ఎప్పుడు పెంచితే అప్పుడు పెంచుతామని చెప్పలేదన్నారు. ఎన్నికల తరువాత జీతం పెంచే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!