Botsa Satyanarayana: వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రావడం ఖాయం.. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో JNTU కాలేజ్‌లో అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లను ఇంఛార్జ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కలిసిన ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. JNTU కాలేజ్ లో 39 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు ఏర్పాటు చేశాం అన్నారు.. 2013వ సంవత్సరంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరు చేయించడం జరిగిందని గుర్తుచేసుకున్నారు.. అయితే, ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఫండ్స్ ఉన్నప్పటికీ నరసరావుపేటలో తాత్కాలిక బిల్డింగ్ తో నిర్వహించారు అన్నారు. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్డింగ్ నిర్మాణం చేపట్టి.. 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది.. ఇంకా ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉంది అన్నారు. ఒక విద్యార్థి రెస్పెక్టబుల్ ఉద్యోగంలో ఉండడం వల్ల వారి గ్రామాల రూపు రేఖలు మారిపోతాయి.. అది దృష్టిలో పెట్టుకిని విద్యార్థులు ఓ లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. మరోవైపు 1వ తరగత నుంచే ఇంగ్లీష్ మీడియం క్లాసులు కల్పిస్తున్న ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిది అని కొనియాడారు.. విద్యార్థులు ఎలాంటి సలహాలు, సందేహాలు, ఏంటో నేరుగా స్పందిస్తే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి రావడం ఖాయం అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.
Read Also: Girls Missing: ముంబైలో ఐదుగురు బాలికలు మిస్సింగ్.. వెతుకులాటలో పోలీసులు