Minister BC Janardhan Reddy: గూగుల్ తో చారిత్రక ఒప్పందం చేసుకోవడంపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మార్గ దర్శకత్వంలో యువనేత లోకేష్ కృషితో ఏపీకి గూగుల్ కంపెనీ రావడం అభినందనీయం అన్నారు.
BC Janardhan Reddy: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడాది పాలనకు తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారి బాలికల చేత సిమెంట్ రోడ్డును ప్రారంభోత్సవ రిబ్బన్ కటింగ్ చేయించారు మంత్రి.
ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆధునిక టెక్నాలజీతో ఏపీ రహదారులు పటిష్టంగా మారనున్నాయి, రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా డెన్మార్క్ డానిష్ ఫైబర్ టెక్నాలజీతో ఆర్ అండ్ బీ శాఖ వినూత్న ప్రయోగంతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి అమ్మ వార్లకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ఇందిరమ్మ దంపతులు దర్శించుకున్నారు.. యాగంటి ఆలయ క్షేత్రానికి చేరుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి - ఇందిరమ్మ దంపతులకు ఆలయం మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు,
BC Janardhan Reddy: గతంలో మన రోడ్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చూశారు అని రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయంలో మన రోడ్లపై పక్క రాష్టాలు జోకులు కూడా వేశాయని పేర్కొన్నారు. మొత్తం రూ. 3, 014 కోట్లుతో పనులు చేస్తున్నాం.. రూ. 94 కోట్లు ఏలూరు జిల్లాకు కేటాయించాం అన్నారు.
ఎంతో మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ.. ఆ పేరుతో జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి.. నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పది మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరుతో కూటమి ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిందన్నారు..
మాకు రైతులకు.. ప్రజలకు సేవనే మాకు ముఖ్యం.. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు అని స్పష్టం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆందోళనలు చేసిన రైతులపై కేసులు పెట్టారని గుర్తుచేశారు.. రైతులను రౌడీ షీటర్లుగా మార్చారని ఆరోపించిన ఆయన.. కలెక్టరేట్ వద్ద వైస్సార్సీపీ నేతలు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు..
చంద్రబాబు అంటే అభివృద్ధికి అంబాసిడర్ అని.. ఆయన స్పూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా.. రోడ్ల మరమ్మతు పనులను తనిఖీ చేసేందుకు వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు.
సంక్రాంతిలోగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గుంతలను పూడ్చి వేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రోడ్ల పనులకు రెన్యూవల్ చేయలేదని, ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. టూరిజంకు భారీ నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు.
ఏపీలో ఈ రోజు రెవెన్యూ గ్రామ సభలు ప్రారంభమయ్యాయి.. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది.. అయితే, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పల్లెలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక, సీఎం సహాయ నిధికి, సంబంధించి స్థానిక వీఆర్వో గంగన్న తనను 2 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడని, గ్రామ సభలో ఓ మహిళ మంత్రికి ఫిర్యాదు…