బనగానపల్లె జుర్రేరు వాగు ఆధునీకరణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి... కాటసాని రామిరెడ్డికి సవాల్ విసిరిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కాటసాని తన అనుచరుని ఫంక్షన్ హాల్ కోసమే జుర్రేరు వాగు ఆక్రమించి వాకింగ్ ట్రాక్ నిర్మించారని ఆరోపించారు.. అక్రమ నిర్మాణాలన్నీ కచ్చితంగా తొలగిస్తాం, ఆక్రమణదారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు.. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణ నడి బొడ్డున ఉన్న జుర్రేరు వాగు ఆధునీకరణకు సంబంధించి మంత్రి…
ప్రజలు మిమ్మల్ని గెలిపించింది శాసనసభకు రావడానికే.. కానీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసన సభకు రాకుండా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ఇక, గుంతల్లో చిడతల బేరం పేరుతో మీడియాలో కథనాలు వస్తున్నాయి.. గడిచిన ఐదు సంవత్సరాలకే రోడ్లు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసు అన్నారు..
గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు.
రాష్ట్రంలో మెరుగైన రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన 7071 కి.మీ రహదారులకు సంబంధించిన 1393 రోడ్లను గుంతల రహిత రహదారులుగా మార్చేందుకు రూ.290 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి వివరించారు
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన కీలక సదస్సుతో మౌలిక వసతుల రంగంలో వృద్ధి, నూతన పెట్టుబడుల అన్వేషణకు, పెట్టుబడుల్లో భాగస్వామ్యానికి మంచి అవకాశం లభించినట్లైందని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి అన్నారు. విశాఖలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల సదస్సులో మంత్రి నారా లోకేష్‌తో పాటు మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
BC Janardhan Reddy: 2025 జూన్ లోగా రామాయపట్నం పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. 2019లో సీఎం చంద్రబాబు నాయుడు రామాయపట్నం పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. రూ. 4929 కోట్ల వ్యయంతో పోర్ట్ నిర్మాణం కొనసాగుతుంది.