Minister AppalaRaju: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీపై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాకుళంలో జరిగే సభ స్క్రిప్ట్ కోసం చంద్రబాబును పవన్ కలిశాడని ఆయన ఆరోపించారు. బీజేపీతో పొత్తులో ఉండి తన రేటు పెంచుకోవడానికే చంద్రబాబును పవన్ కలిశాడని మంత్రి అప్పలరాజు ఆరోపించారు. పవన్ తనను నమ్మిన వారిని ముంచేస్తున్నాడని.. ఆయనకు డబ్బు పిచ్చి పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కలయికలో ఆశ్చర్యం ఏం లేదన్నారు. సింగిల్‌గా పోటీ చేసే దమ్ము టీడీపీ,…
Minister AppalaRaju: ఏపీ పశు సంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే చిత్తూరు డైరీ మూతపడిందని.. అది తన ఘనతేనని చంద్రబాబు తన సక్సెస్ స్టోరీలో రాసుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అమూల్ లీజ్ పాలసీపై అనవసరమైన రాద్దాంతం చేస్తున్నారని.. అమూల్ ద్వారా రూ.500 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి అప్పలరాజు క్లారిటీ ఇచ్చారు. తమ హయాంలో పాల రైతులు గతంలో చూడని ధరలు ఇప్పుడు…
YSRCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు సెక్యూరిటీని పెంచుతూ ఏపీ ప్రభుత్వం భద్రతా పరమైన చర్యలు తీసుకుంది. ఈ మేరకు అదనంగా నలుగురు పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజును హెచ్చరిస్తూ మావోయిస్టుల లేఖ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల సిఫార్సు మేరకు నలుగురు పోలీసులను కేటాయిస్తు రాష్ట్ర పోలీసు శాఖ భద్రతా పరమైన చర్యలు తీసుకుంది. Read Also: Missing Case: కడపలో ఏడో తరగతి విద్యార్థిని…
Minister Appala Raju: ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ నేతలు అమరావతి నుంచి అరసవల్లి యాత్ర అంటూ చేపట్టారని ఆరోపించారు. ఒక సామాజిక వర్గం వారే ఈ పాదయాత్రను తలపెట్టారని.. గతంలో తిరుపతి యాత్రలో శాంతి భద్రతలకు విఘూతం కల్పించారని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్ర విశాఖపై దండయాత్ర కోసమేనా అంటూ మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. వాళ్ల అమరావతి యాత్రనా లేదా విశాఖపై…
ప్రకాశం జిల్లా పర్యటనలో మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని, వైఎస్ఆర్ కుటుంబాన్ని వేర్వేరుగా చూడలేమని తెలిపారు. విజయమ్మ గౌరవ అధ్యక్షురాలి పదవికి ఎందుకు రాజీనామా చేస్తున్నారో వివరించారని.. అయినా ఈ విషయంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వైఎస్ఆర్‌సీపీ అనేది జగన్ కష్టంతో ఎదిగిన పార్టీ అని అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్లీనరీకి వచ్చిన జనాన్ని చూసి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిందని.. దీంతో పిచ్చిపిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని ఒక వర్గానికి ధారాదత్తం చేశారని ఆరోపించారు.…
సీదిరి అప్పలరాజు. కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి. ఇంఛార్జ్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టాక.. జిల్లా సమావేశాలలో ఆయన తీరు ప్రశ్నగా మారింది. అధికారులను ఇరుకున పెడదామని ఆయన చేస్తున్న ప్రయత్నాలు చర్చగా మారుతున్నాయి. తాను స్పెషల్‌గా కనిపించాలనో ఏమో ప్రతి చిన్న విషయానికీ గంటల తరబడి సుదీర్ఘ ప్రసంగాలు చేస్తున్నారట. ఎవరైనా అధికారులు మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోతుంటే.. ఐ నో ఎవ్రీథింగ్.. ప్లీజ్ సిట్ డౌన్.. అని ఇంగ్లీష్‌లో ఏకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నట్టు చెవులు…
వరుసగా అన్ని చార్జీలు పెరిగిపోయాయంటూ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న టీడీపీ… వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు యాత్రపై సెటైర్లు వేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. చంద్రబాబు చేస్తున్న యాత్ర చంద్రబాబుకి బాదుడే బాదుడు యాత్ర అవుతుందన్న ఆయన.. శవాల వద్దకే చంద్రబాబు యాత్ర అని పేరు పెట్టుకోవాలని.. ఎందుకంటే చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. Read Also: Nadendla Manohar: ఓట్లు…
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ పాటకు పలువురు డ్యాన్స్ వేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా నాటు నాటు అంటూ సాగే పాటకు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు డ్యాన్స్ చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన ఓ బాలుడితో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ కార్యకర్తలు, నెటిజన్‌లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.…