Minister Ambati Rambabu: విజనరీ లీడర్ కి.. విజన్ సరిచేసుకోమని బెయిల్ ఇచ్చారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నేటి సాయంత్రం విడుదల అయ్యారు. అయితే, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చంద్రబాబు బెయిల్ పై బయటకు రావడంతో టీడీపీ శ్రేణులు నిజం గెలిచింది, వస్తున్నా మీ కోసం అంటూ సంబరాలు చేసుకున్నారు. దీనికి మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.
Read Also: Sachin Pilot: సచిన్ పైలట్, సారా అబ్దుల్లా విడాకులు తీసుకున్నారు.. ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడి
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
స్కిల్ డెవెలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకి వచ్చిన బెయిల్ మానవతా దృక్పథంతో ఇచ్చింది మాత్రమేనని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చారని, దీనిపై టీడీపీ ఎందుకంత హంగామా చేస్తుందని ఆయన మండిపడ్డారు. బాబు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మాత్రమే బెయిల్ వచ్చిందన్నారు. వస్తున్నా.. మీ కోసం కాదు..! వస్తున్నా కంటి ఆపరేషన్ కోసం అని మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా సెటైర్ వేశారు. కళ్లు కనిపించకే మధ్యంతర బెయిల్ ఇచ్చారు.. కంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనంటూ ఆయన విమర్శించారు. విజనరీ లీడర్ కి.. విజన్ సరిచేసుకోమని బెయిల్ ఇచ్చారు!.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Renu Desai: వరుణ్ పెళ్ళి.. నేనే కాదు వాళ్లను కూడా పంపడం లేదు
నిజం గెలిచింది, వస్తున్నా మీకోసం, న్యాయం, ధర్మం గెలిచిందని మాట్లాడటం సమంజసం కాదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని అంబటి హితవు పలికారు. అయితే, తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్‌కు జ్ఞానోదయం అయింది అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇతర పార్టీల గెలుపు కోసం పార్టీని తాకట్టు పెట్టడం అనైతికమని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల ముందో, ఆ తర్వాతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా టీడీపీ జెండా పీకేస్తారని ఆయన విమర్శలు గుప్పించారు.
విజనరీ లీడర్ కి
విజన్ సరిచేసుకోమని బెయిల్ ఇచ్చారు !@ncbn @naralokesh— Ambati Rambabu (@AmbatiRambabu) October 31, 2023
వస్తున్నా……మీ కోసం కాదు!
వస్తున్నా కంటి ఆపరేషన్ కోసం ! @ncbn pic.twitter.com/EUjVrlNyan— Ambati Rambabu (@AmbatiRambabu) October 31, 2023
తాజావార్తలు
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
-
Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!