భారత దిగ్గజ అథ్లెటిక్ ప్లేయర్ స్ప్రింటర్ మిల్కా సింగ్ కరోనాతో మరణించారు. ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. తన పరుగుతో భారత కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేశాడు. మిల్కాసింగ్ నాలుగు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం సహా 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో మిల్కా పసిడి పతకంతో మెరిశాడు. ఆయన మరణంపై యావత్ భారతం ఘన నివాళులు అర్పిస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీప్రముఖులు సంతాపం తెలిపారు. “పరుగుల వీరుడు…