ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో రైలు ట్రాక్‌లపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఛీ.. అంటూ అసహ్యించుకుంటున్నారు. సభ్యత, సంస్కారం లేదా అతనికి అంటూ మండిపడుతున్నారు.
హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది. మెట్రో రైల్ వేళలను మరింతగా పొడిగిస్తూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 10.15 గంటల వరకే హైదరాబాద్‌లో మెట్రో సేవలు అందుతుండగా.. ఇకపై రాత్రి 11 గంటలకు పెంచాలని హైదరాబాద్ మెట్రోరైలు నిర్ణయించింది.
Dubai Crown Prince: ఓ దేశానికి రాజు అంటే ఆయనకు సౌకర్యాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రాజు ఎక్కడికి వెళ్లినా సకల భోగాలను అనుభవించాల్సిందే. భద్రత దృష్ట్యా వాళ్లు విమానాలు, హెలికాప్టర్లు, కార్లలో తిరుగుతుంటారు. అయితే అలాంటి రాజభోగాలను పక్కనపెట్టి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ లండన్ మెట్రోలో సామాన్య పౌరుడిగా పర్యటించి అందర్ని ఆశ్చర్యపరిచాడు. కానీ సదరు యువరాజు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన్ను…
ప్రయాణికులను త్వరగా గమ్య స్థానాలకు చేర్చేందుకు, హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఏర్పాటైన మెట్రో రైలు పరుగులు పెడుతుండటంతో.. మెట్రో స్టేషన్లకు కూడా ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది. ప్రస్తుతం నడుపుతున్న మెట్రో రైళ్లు సరిపోవడం లేక కిక్కిరిసి మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఎక్కువసేపు మెట్రోస్టేషన్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే కొంత కాలంగా.. మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే మెట్రో…
ఈరోజుల్లో కుటుంబ కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతున్నారు యువత. అడపదడప రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వ్యూస్ కోసం తాపత్రయ పడుతున్నారు. రీల్స్ చేయడానికి ఒక ప్లేస్ అంటూ లేకుండా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేసేందుకు వెనకాడటం లేదు. ఒకరు చూస్తారనే భయంలేదు. విచ్ఛలవిడిగా రీల్స్ చేసి దానిని పోస్ట్ చేసి కామెంట్స్, వ్యూస్ కోసం తాప్రతయ పడుతున్నారు. రోడ్డు, పార్క్, వాష్ రూమ్స్ రీల్స్…
అమెరికాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. దీనికి తోడు బాంబు పేలుడు కకావికలం చేసింది. బ్రూక్లిన్లో రైలు ప్రయాణించే ఓ సబ్వేలో ఐదుగురిపై కాల్పులు జరిపారు దుండగులు. దీంతో సబ్వే అంతా రక్తసిక్తమైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో అమెరికాలో గన్ కల్చర్ మరోసారి తెరపైకి వచ్చింది. న్యూయార్క్ లో మాస్క్ తో వచ్చి దుండగులు బీభత్సం కలిగించారు. నిత్యం రద్దీగా వుండే సబ్వే లో కాల్పులతో అంతా రక్తసిక్తమైందని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఎంతమంది మరణించారనే…
మహారాష్ట్రలో రెండో అతి పెద్దనగరం పూణెలో మెట్రోరైలు సేవలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ ఆదివారం నాడు పూణె మెట్రోరైలు ప్రాజెక్టును ప్రారంభించారు. తొలుత పుణె మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. 9.5 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అనంతరం గర్వారే మెట్రో స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి పూణె మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా…
నిన్న కేటీఆర్, మెట్రో ప్యాసింజర్ల కు ఇచ్చిన హామీ ని అమలు చేస్తున్నట్లు ప్రకటించిన హెచ్ఎంఆర్… ప్యాసింజర్ల అభ్యర్థనతో మెట్రో రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది. మెట్రో రైలు సమయం పొడిగించింది. రేపటి నుండి ఉదయం అరుగంటల నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక రాత్రి చివరి రైళ్లు 10.15 కు స్టేషన్ల నుంచి కదులుతాయి. ఉదయం 6 గంటల నుంచి చివరి స్టేషన్ నుంచి ప్రారంభం కానున్న మొదటి మెట్రో.. రాత్రి 10.15 గంటలకు…
నవ్యాంధ్ర ఏర్పడి దాదాపు ఏడేళ్లన్నరేళ్లు కావస్తోంది. విభజన హామీలో భాగంగా విశాఖకు రైల్వే జోన్ తోపాటు మైట్రో ట్రైన్ ప్రాజెక్టు రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఏపీకి మెట్రో ట్రైన్ ప్రాజెక్టు మంజూరు కాకపోవడం శోచనీయంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కు మాత్రమే మెట్రో రైలు ప్రాజెక్టును అప్పటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. టీఆర్ఎస్ సర్కారు హయాంలో మెట్రో ట్రైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్లో కొంతమేర ట్రాఫిక్ కష్టాలు తీరిపోయాయి. ఈ…