Dubai Crown Prince: ఓ దేశానికి రాజు అంటే ఆయనకు సౌకర్యాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రాజు ఎక్కడికి వెళ్లినా సకల భోగాలను అనుభవించాల్సిందే. భద్రత దృష్ట్యా వాళ్లు విమానాలు, హెలికాప్టర్లు, కార్లలో తిరుగుతుంటారు. అయితే అలాంటి రాజభోగాలను పక్కనపెట్టి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ లండన్ మెట్రోలో సామాన్య పౌరుడిగా పర్యటించి అందర్ని ఆశ్చర్యపరిచాడు. కానీ సదరు యువరాజు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న యువరాజు తన స్నేహితుడు షేక్ హమ్దాన్ అతీజ్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
Read Also: A.R. Rehman: ఆస్కార్ అవార్డు విన్నర్ 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో చూడండి
కాగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్తూమ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 14.5 మిలియన్‌ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విలాసవంత ప్రయాణం వదిలేసి ప్రిన్స్ ఇలా నిత్యం రద్దీగా ఉండే మెట్రో రైలులో సామాన్య పౌరుడి తరహాలో జర్నీ చేయడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌ను అందరూ ముద్దుగా ఫజ్జా అని పిలుస్తుంటారు. ఆయన ప్రస్తుతం తన కుటుంబం, స్నేహితులతో లండన్‌లో వెకేషన్‌లో ఉన్నారు. అటు లండన్‌లో మెట్రోరైలు అండర్ గ్రౌండ్‌లో ప్రయాణిస్తుంటుంది. ఇది లండన్‌లో వేగవంతమైన రవాణా వ్యవస్థ. లండన్‌తో పాటు ఇంగ్లండ్‌లోని బకింగ్‌హామ్‌షైర్, ఎసెక్స్, హెర్ట్‌ఫోర్డ్‌షైర్ పక్కనే ఉన్న కౌంటీలలోని కొన్ని ప్రాంతాలకు ఈ మెట్రోరైలు సంస్థ సేవలు అందిస్తుంది.