మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందితులకు బడితపూజ జరిగింది. నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 14 రోజులు జ్యుడీషియల కస్టడీకి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు పంపింది. నిందితులను కోర్టులో హాజరుపరిచి పోలీసులు బయటకు తీసుకొస్తుండగా.. ఇప్పటికే కోపంతో రగిలిపోతున్న న్యాయవాదులు అమాంతంగా ఎటాక్ చేశారు.