మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందితులకు బడితపూజ జరిగింది. నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 14 రోజులు జ్యుడీషియల కస్టడీకి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు పంపింది. నిందితులను కోర్టులో హాజరుపరిచి పోలీసులు బయటకు తీసుకొస్తుండగా.. ఇప్పటికే కోపంతో రగిలిపోతున్న న్యాయవాదులు అమాంతంగా ఎటాక్ చేశారు.
Merchant Navy officer Murder: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ని భార్య ముస్కాన్ రస్తోగి తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసింది. ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని ఇంత దారుణంగా ఏ మహిళ చంపుతుందా..? అని మాట్లాడుకుంటున్నారు.