ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారిపొడవునా జై జగన్ నినాదాలతో యాత్ర మార్మోగుతోంది.
బస్సు యాత్ర సందర్భంగా పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కో-ఆర్డినేటర్‌గా ఉన్న పితాని బాలకృష్ణ.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఓ వైపు జోరుగా ఎన్నికల ప్రచారం.. మరో వైపు చేరికలతో ఉత్సాహంగా సాగుతోంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. నాలుగో రోజు కర్నూలు జిల్లాలో బస్సు ఉత్సాహం కొనసాగింది. బస్సు యాత్ర సందర్భంగా పలువురు కళ్యాణదుర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ రోజు కర్నూలు జిల్లా రాతన నుంచి మొదలైన సీఎం జగన్ బస్సు యాత్ర నేటి రాత్రికి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గలి ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖి
కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర 3వ రోజుకు చేరుకుంది. ఎమ్మిగనూరులో భారీగా నిర్వహిస్తోన్న 'మేమంతా సిద్ధం' సభకు.. లక్షలాదిగా జనం తరలివచ్చారు. నేడు దిగ్విజయంగా సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది.