Election Counting Updates: త్రిపురలో అధికార బీజేపీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం 60 స్థానాలకు గాను 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ సునాయాసంగా గెలుపు దిశగా పయనిస్తోంది.
Election Updates: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని లుమ్లా అసెంబ్లీ నియోజకవర్గం, రామ్‌గఢ్ (జార్ఖండ్), ఈరోడ్ ఈస్ట్ (తమిళనాడు), సాగర్దిఘి (పశ్చిమ బెంగాల్) తదితర స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతోంది.
Election Results: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
Meghalaya: నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ మార్చి 2న వెలువడబోతున్నాయి. ఇదిలా ఉంటే త్రిపురలో సొంతంగా బీజేపీ అధికారంలో వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేశాయి. దీంతో పాటు నాగాలాండ్ రాష్ట్రంలో మిత్రపక్షం ఎన్పీపీతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.
హై-వోల్టేజ్ ప్రచారాల తర్వాత, రెండు కీలక ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్‌లలో ఎన్నికల పోరు తుదిదశకు చేరుకుంది. ఎందుకంటే ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని సోమవారం నిర్ణయిస్తారు.
Meghalaya: మేఘాలయ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడ ఎర్నెస్ట్ మావ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. మేఘాలయలో బీఫ్ తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని.. నేను కూడా బీఫ్ తింటానని మావ్రీ అన్నారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు ఆమోదించిన తీర్మానంపై నేనుమాట్లాడనని..మేఘాలయంలో అందరూ బీఫ్ తింటారని, దీనికి ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు. ఇది ఇక్కడి ప్రజల జీవనశైలి అని చెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. మేఘాలయలో కబేళాలు ఉన్నాయి, అందరూ ఆవును లేదా పందని…
PM Modi: మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సొంత నియోజకవర్గం సౌత్ తురాలోని పీఎ సంగ్మా స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీని నిర్వహించేందుకు బీజేపీకి మేఘాలయ క్రీడా విభాగం అనుమతి నిరాకరించింది.
Cruel Woman: అసోంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిల తన ప్రియుడితో కలిసి భర్త, అత్తలను హత్య చేసింది. ఆపై వారి మృతదేహాలను ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్లలో పెట్టి కాల్వలో పడేసింది.
Assembly Election 2023: ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికలు రాబోతున్నాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలతో 2023 ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 16న, మేఘాలయం, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరపుతున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను మార్చి 2న ప్రకటించనుంది. 2018లో త్రిపురలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ప్రస్తుతం మరోసారి ఈ రాష్ట్రంలో అధికారం…
PM To Visit Poll-Bound Tripura, Meghalaya Today: త్వరలో ఎన్నికలు జరగబోయే త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పర్యటించనున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు రూ. 6,800 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. హౌసింగ్, రోడ్లు, వ్యవసాయం, టెలికాం, ఐటీ, టూరిజం రంగాల్లో అనేక ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని, షిల్లాంగ్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.