Peace talks between Assam-Meghalaya: అస్సాం- మేఘాలయ సరిహద్దుల్లో భారీగా హింస జరగడంతో అస్సాం ఫారెస్ట్ గార్డుతో సహా మొత్తం ఆరుగురు మరణించారు. కలప స్మగ్లింగ్ వివాదం రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు హింసకు దారి తీసింది. ప్రస్తుతం పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాకు సమీపంలో ఉన్న మేఘాలయ, అస్సాం సరిహద్దు గ్రామం అయిన ఉమ్లాపర్ వద్ద అస్సాం పోలీసులు నిఘాపెంచారు. ఇదిలా ఉంటే అస్సాం పెట్రోలియం కార్మికులు మేఘాలయకు ఇంధన రవాణా నిలిపివేస్తునట్లు ప్రకటించారు. అస్సాం…
Assam and Meghalaya Border Firing : అసోం-మేఘాలయ రాష్ట్రాల మధ్య మళ్లీ హింస చెలరేగింది. అసోంలోని వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని బోర్డర్ లో జరిగిన కాల్పుల ఘటనలో ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు మృతిచెందారు.
Meghalaya BJP leader’s farmhouse run as brothel House:మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు అత్యంత నీచానికి దిగజరాడు.. బాధ్యతాయుతమైన హోదాలో ఉండీ, చిన్న పిల్లలతో బ్రోతల్ హౌజ్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో మిలిటెంట్ గా ఉండీ, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న బెర్నార్డ్ మరాక్ తన ఫామ్ హౌజ్ లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. పోలీసులు పక్కా సమాచారంతో శనివారం తురాలోని ఫామ్ హౌజ్ పై దాడి చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించామని.. వెస్ట్…
అకాల వర్షాలు అస్సాంను ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల అస్సాంలోని 6 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వర్షాల వల్ల మెరుపు వరదలు సంభవించాయి. వాగులు, నదులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరుగిపడుతున్నాయి. ఈ ఏడాదిలో తొలిసారి అస్సాంను వరదలు ముంచెత్తాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నిన్న డిమా హసావో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. డిమా హసావో జిల్లాలోని 12 గ్రామాల్లో కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది.…
తెలంగాణ పర్యటనకు వచ్చిన మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా.. ఇవాళ మంత్రి కేటీఆర్‌ను కలిశారు.. ఉదయం ప్రగతి భవన్‌కు వచ్చిన సంగ్మా దంపతులను.. మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.. ఇక, వివిధ అంశాలపై కేటీఆర్, సంగ్మా మధ్య చర్చలు జరిగాయి.. మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాలు, వ్యాపారాలపై ఐటీ మంత్రి చర్చించినట్లు సమాచారం. ఇక, ఈ సమావేశం విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్…
మేఘాలయ హైకోర్టు గురువారం నాడు కీలక తీర్పు వెల్లడించింది. మహిళ జననాంగాన్ని లోదుస్తులపై నుంచి పురుషాంగంతో తాకినా అత్యాచారంగానే పరిగణించాలని స్పష్టం చేసింది. 2006లో పదేళ్ల బాలిక తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. 2018లో నిందితుడికి ట్రయల్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధించింది. అప్పుడు నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అనంతరం నిందితుడు ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ…
ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాత భారత్‌లో కోవిడ్ పంజా విసురుతోంది.. రోజుకో రికార్డు తరహాలో కేసులు మళ్లీ భారీ సంఖ్యలో పెరుగుతూ పోతున్నాయి.. ఇదే సమమంలో.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఎవ్వరినీ వదలడం లేదు మహమ్మారి.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కోవిడ్ సోకుతుంది.. మరికొందరు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా కోవిడ్ బారినపడుతున్నారు.. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులను కోవిడ్ పలకరించింది.. కేంద్ర మంత్రులు, సీఎంలు, రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతులు చాలా…
మేఘాలయ టీఎంసీ ఛీఫ్‌గా ముకుల్ సంగ్మా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITMC)లో మేఘాలయ ముఖ్యమంత్రి డాక్టర్ ముకుల్ సంగ్మా చేరారు. శుక్రవారం షిల్లాంగ్‌లో జరిగిన టీఎంసీ పార్టీ కొత్తగా ఏర్పడిన మేఘాలయ యూనిట్ తొలి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.మొదటి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ముకుల్ సంగ్మాతో సహా మొత్తం 12 మంది శాసనసభ్యులు హాజరయ్యారని ఉమ్రోయ్ నియోజకవర్గ…
దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆగస్టు 15 వ తేదీ ఆదివారం రోజున స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగంగా నిర్వహించుకుంటుంటే, మేఘాలయ రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా అలజడులు జరిగాయి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఆందోళనలు జరిగాయి. నేషనల్ లిబరేషనల్ కౌన్సిల్ మాజీ నేత థాంగ్‌కీ ఎన్‌కౌంటర్‌తో ఒక్కసారిగి షిల్లాంగ్ అట్టుడికిపోయింది. ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చి వాహనాలను ధ్వంసం చేశారు. ఇటీవలే లైతుంఖ్రా వద్ద జరిగిన బాంబు దాడుల్లో థాంగ్‌కీ హస్తం ఉందనే అనుమానాలు కలగడంతో ఆయన్న…