PM Modi: పీఎం మోదీకి షాకిచ్చిన సీఎం.. ఎన్నికల ర్యాలీ నిర్వహణకు నో పర్మిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సొంత నియోజకవర్గం సౌత్ తురాలోని పీఎ సంగ్మా స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీని నిర్వహించేందుకు బీజేపీకి మేఘాలయ క్రీడా విభాగం అనుమతి నిరాకరించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 24న షిల్లాంగ్, తురాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. అయితే అలోట్‌గ్రే క్రికెట్ స్టేడియంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నందున, సైట్‌లో ఉంచిన మెటీరియల్ భద్రత కోసం సభకు అనుమతించడం లేదని సమాధానం వచ్చింది. ఇక్కడ కాకుండా మరే చోటైనా సభ ఏర్పాటు చేసుకునేలా చూడాలంటూ బీజేపీకి సూచించింది.
Read Also: Pramod Muthalik: ముస్లిం అమ్మాయిలను ట్రాప్ చేయండి.. జాబ్, భద్రత కల్పిస్తా
Also Read
ఇక అదే స్టేడియంలో సభ అనుమతి విషయమై పరిశీలిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ టెంబే తెలిపారు. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే.. 127 కోట్ల రూపాయలతో నిర్మించిన అలోట్‌గ్రే క్రికెట్ స్టేడియాన్ని గతేడాది 16న మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా ప్రారంభించారు. ఇది జరిగిన రెండు నెలల అనంతరం ఇప్పుడు నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పడమేంటని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రితురాజ్ సిన్హా మాట్లాడుతూ ‘‘కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా మమ్మల్ని చూసి భయపడుతున్నారా? వారు మేఘాలయలో బీజేపీ వేవ్‌ను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారని అనిపిస్తోంది. మీరు (సంగ్మా) ప్రధానమంత్రి మోదీ ర్యాలీని ఆపడానికి ప్రయత్నించవచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు’’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!