మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జంట రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ మే 23న మేఘాలయలో అదృశ్యమయ్యారు. మే 11న వివాహం చేసుకుని హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లారు. మే 23న కొత్త జంట అదృశ్యమైంది.
మేఘాలయలో తప్పిపోయిన ఇండోర్ మహిళ సోనమ్‌కు సంబంధించిన కీలక ఆధారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు ఖాసీ హిల్స్ ప్రాంతంలో సోనమ్‌కు సంబంధించిన రెయిన్ కోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ తెలిపారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన కొత్త జంట రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ గత నెల 23న మేఘాలయలో అదృశ్యమయ్యారు. మే 11న వివాహం చేసుకుని హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వచ్చారు. మూడు రోజుల తర్వాత తూర్పు ఖాసీ హిల్స్ కొండ ప్రాంతంలో అదృశ్యమయ్యారు.
మేఘాలయ హనీమూన్‌కు వెళ్లి అదృశ్యమైన జంటలో భర్త రాజా రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి భార్య సోనమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
చర్చిలోపల 'జై శ్రీరామ్' నినాదాలు చేసిన ఉదంతం మేఘాలయలో వెలుగు చూసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆకాష్ సాగర్‌పై సామాజిక కార్యకర్త ఏంజెలా రంగద్ ఫిర్యాదు చేశారు. ఎపిఫనీ చర్చిలోకి నిబంధనలు అతిక్రమించాడని, చర్చి యొక్క మతపరమైన పవిత్రతను ఉద్దేశపూర్వకంగా దెబ్బ తీశాడని పేర్కొన్నారు.
మేఘాలయలోని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (ఎన్‌ఇహెచ్‌యూ) ఆందోళనలతో అట్టుడికింది. వైస్-ఛాన్సలర్, రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్‌లు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ విద్యార్థులు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ ఆందోళనలు ఆదివారం తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.
మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాల్సెంగ్.సి.మారక్(82) శుక్రవారం వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 82 ఏళ్ల వయస్సు గల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తురా సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఏడు కేంద్రాల్లో 1563 మంది విద్యార్థులు రీ ఎగ్జామినేషన్ కు హాజరుకావాల్సి ఉండగా..అందులో 813 మంది (52 శాతం) పరీక్ష రాశారు.
నీట్-యూజీ పరీక్షా పత్రం లీక్ అయిన తర్వాత.. నీట్ ఫలితాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు ఈరోజు (జూన్ 23)న రీ-ఎగ్జామ్ నిర్వహించారు. పరీక్ష ప్రారంభమైంది.