(జూన్ 22న ‘శ్రీమంజునాథ’ 20 ఏళ్ళు పూర్తి) ఎందరో భక్తశిఖామణుల జీవితగాథలు తెరపై ఆవిష్కృతమయ్యాయి. ఆ కోవకు చెందినదే చిరంజీవి, అర్జున్ నటించిన భక్తి రసచిత్రం ‘శ్రీమంజునాథ’. కర్ణాటకలోని కోలార్ జిల్లా కమ్మసంద్రకు చెందిన కోటిలింగేశ్వర స్వామి దేవాలయం భక్తకోటిని విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అక్కడి ధర్మస్థల క్షేత్రం కూడా సుప్రసిద్ధమైనది. ఇక్కడి దేవుడు శ్రీమంజునాథునిగా పూజలందుకుంటూ ఉంటాడు. ఆయన మహిమతో జన్మించిన మంజునాథ అనే భక్తుని కథతో తెరకెక్కిన చిత్రమే ‘శ్రీమంజునాథ’. శివునిగా చిరంజీవి, భక్తునిగా…
నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి రక్తదానం చేశారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకు ఉందని ఆయన చెప్పారు. రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. రక్తదానం చేస్తున్న పిక్స్‌ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి, అన్ని దానాల్లో కన్న రక్తదానం గొప్పదంటూ ట్వీట్ చేశారు. కాగా, చిరు బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితుల్లో చిరు ఆక్సిజన్…
ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు చిరంజీవి మరో ముందడుగు వేశారు. అంబులెన్స్ కొరత ఉందన్న సంగతి చిరంజీవి దృష్టికి వెళ్లడంతో త్వరలోనే అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా చిరు సేవలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సాటి మనిషి ప్రాణాన్ని కాపాడడం మానవత్వానికి సంబంధించిన మహోన్నతమైన సేవ అని…
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే ఆక్సిజన్ బ్యాంక్ సేవలను నెలకొల్పాడు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ లతో ప్రజలకు అండగా నిలుస్తున్న చిరు.. తాజాగా చిరు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా తెలుగు రాష్ట్రాల అంతటా చిరంజీవి అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభించాలని చిరు భావిస్తున్నాడని తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారని…
కరోనా క్రైసిస్ ఛారిటి ఆధ్వరంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం సోమవారం ఉదయం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ శంకర్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రెటరీ దొరై లతో పాటు పలువురు సినీ టెక్నీషియన్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి…
మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలోని చాలా జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన ఇటీవల తెలిపారు. ఈ మేరకు తొలి విడతగా గుంటూరు, అనంతపురం జిల్లాలకు ఆక్సిజన్ బ్యాంకులు ఎర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తరలిస్తున్న వీడియోను చిరంజీవి ట్విటర్లో షేర్ చేశారు. చిరు…
నటి పావలా శ్యామల దీన స్థితిని చూసి మెగాస్టార్ చిరంజీవి మరోసారి సాయం చేశారు. గతంలో పావల శ్యామల సరైన ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిరంజీవి 2లక్షలు రూపాయలు సాయపడిన సంగతి తెలిసిందే. కుమార్తె శ్రీజ చేతులమీదుగా ఈ సాయం చేశారు. తాజాగా ఆమె పరిస్థితిపై వస్తున్న వార్తలు చూసిన చిరు మరోసారి ఆర్థిక సాయాన్ని అందించారు. ఆమెకు రూ. 1 లక్షా 1500 లను అందించారు. అంతేకాదు ‘మా’ సభ్యత్వం ఇప్పించి, ఆమెకు…
నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయాల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానంతో సినిమా రంగానికి వచ్చిన టీఎన్ఆర్ తనదైన మార్గాన్ని ఎంచుకుని ఎదిగారు. టీఎన్ఆర్ మరణవార్త తెలిసిన మెగాస్టార్ చిరంజీవి తన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం టీఎన్ఆర్ భార్యా పిల్లలకు ఫోన్ చేసి పరామర్శించారు. దాంతోపాటు లక్షరూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు.టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, తను…