సోషల్ మీడియా అభిమానులకు, సెలబ్రెటీలకు మధ్య దూరాన్ని తగ్గించింది. దీంతో తమ అభిమాన స్టార్స్ ను సామాజిక మాధ్యమాల్లో ఫాలో అవ్వడమే కాకుండా… వారి పుట్టినరోజు, లేదా వాళ్ళ మూవీస్ కి సంబంధించి అప్డేట్ ఇలా ఏదైనా స్పెషల్ ఉందంటే చాలు హంగామా చేస్తున్నారు. తాజాగా మెగా అభిమానులు కూడా అప్పుడే సంబరాలు మొదలెట్టేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకు ఇంకా 50 రోజులు ఉండగా… అప్పుడే హడావిడి మొదలైపోయింది. వారి హడావిడికి మరింత జోష్ పెరిగేలా తాజాగా చిరంజీవి సిడీపీ రిలీజ్ అయ్యింది. ఇంకేముంది నెట్టింట్లో ఈ సీడీపీతో రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు మెగా ఫ్యాన్స్.
Read Also : కమల్ “విక్రమ్” కోసం రంగంలోకి మరో నేషనల్ అవార్డు విన్నర్
ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి సామాజిక సేవలో కూడా ముందుంటూ ఎంతోమంది యూత్ కు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను కాపాడిన చిరు కరోనా కష్టకాలంలోనూ ప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ బ్యాంకులు స్థాపించారు. లాక్ డౌన్ కాలంలో సినిమా కార్మికులకు సీసీసీ ద్వారా ఇంట్లోకి కావలసిన సరకులను అందించడమే కాకుండా ఫ్రీగా వ్యాక్సినేషన్ కూడా వేయించారు. ఆయన సేవను గుర్తించిన పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా చిరుపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన చిరంజీవికి టాలీవుడ్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక మిస్టర్ బర్త్ డే రోజున ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటినుంచి చిరు బర్త్ డే బ్యాష్ ట్యాగ్ లతో, పిక్స్ తో వారు రచ్చరచ్చ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఇటీవల తలపతి విజయ్, అజిత్ అభిమానులు కూడా వాళ్ళ సినిమాలకు సంబంధించి మాములుగా హల్చల్ చేయలేదు.