రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో మెగా వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటికే చిరు కోరిక, రిక్వెస్ట్ మేరకు మెగా అభిమానుల సంఘాలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చేశారు. ఇందులో భాగంగా చిరు అభిమానులు ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటారు.అంతేకాకుండా రక్తదాన శిబిరాన్ని కూడా ప్లాన్ చేశారు. మరో వైపు చిరు సినిమాల పండగ జరుగుతోంది. వరుస సినిమాలతో పాటు వాటి అప్డేట్స్ కుడి రాబోతున్నాయన్న విషయం మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని…
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు రాబోతోంది. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేయబోతున్నాం అంటూ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో “గెట్ రెడీ ఫర్ మెగా యుఫోరియా” అంటూ మెగా అభిమానుల్లో జోష్ పెంచేశారు. “చిరు 154” మూవీ తమిళ్ బ్లాక్ బస్టర్ “వేదాళం” రీమేక్ గా రూపొందబోతోంది. ఈ చిత్రం తమిళ…
మెగాస్టార్ చిరంజీవికి విశాఖపట్నంతో చక్కని అనుబంధం ఉంది. కెరీర్ ప్రారంభంలో చిరంజీవి నటించిన చాలా సినిమాల షూటింగ్స్ వైజాగ్ లోనే జరిగేవి. అంతేకాదు… వైజాగ్ లో చిరంజీవి సినిమా షూటింగ్ జరిగితే… అది సూపర్ హిట్ అనే ఓ సెంటిమెంట్ కూడా మొదలైపోయింది. దాంతో కొంతకాలం పాటు సినిమా షూటింగ్ మొత్తం ఎక్కడ జరిగినా… ఒకటో రెండో సన్నివేశాలను వైజాగ్ లో చిత్రీకరించేవారు. ఇక తెలుగు రాష్ట్రాలు రెండుగా ఏర్పడిన తర్వాత మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల…
ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెగాభిమానులకు పండగ రోజైన ఆ రోజున చిరు సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ఖుషీ అవబోతున్నారు. చిరు ‘ఆచార్య’గా నటిస్తున్న సినిమాతో చివరి దశలో ఉంది. ఇక చిరు 153 ఇటీవల సెట్స్‌పైకి వచ్చింది. ఈ రెండింటితో పాటు, దర్శకులు బాబీ, మెహర్ రమేష్‌తో చిరంజీవి మరో రెండు సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. ఈ నాలుగు సినిమాల అప్ డేట్స్…
ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే! ఈ యేడాది పుట్టిన రోజుకు చిరంజీవి నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నట్టు! అయితే ఇందులో ‘ఆచార్య’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటూ ఉంటే, మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ సినిమా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ షూటింగ్ జరుపుకుంటూ ఉంది. సో… సహజంగానే ‘ఆచార్య’, ‘లూసిఫర్’ రీమేక్ కు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ వస్తుంది. ‘ఆచార్య’ నుండి సాంగ్ లేదా ట్రైలర్…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ జిమ్‌లో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా చిరుతో తీసుకున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ఈరోజు మార్నింగ్ జిమ్‌లో బాస్‌ని కలిశాను. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం సంతోషంగా ఉంది. మీరెప్పుడూ మాకు స్పూర్తి అన్నయ్య’ అని రాసుకొచ్చారు. కాగా, ఆయన చేతి గాయాన్ని చిరు అడిగి తెలుసుకున్నారు. ప్రకాష్ రాజ్ ఇటీవలే షూటింగ్ లో ప్రమాదానికి గురికావడంతో చిన్న సర్జరీ అయిన…
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై చర్చకు మెగాస్టార్ చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సినీపెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత సిని ఇండస్ట్రీ, థియేటర్ సమస్యలను వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంట్లో సమావేశమైన తెలుగు సినీ ప్రముఖులు ఆదివారం…
సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై చర్చకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈమేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, చిరుతో ఫోన్ లో మాట్లాడారు. సినీపెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత సిని ఇండస్ట్రీ, థియేటర్ సమస్యలను వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ కీలక భేటీలో ప్రస్తుతం ఉన్న థియేటర్ల సమస్య గురించి.. టిక్కెట్ రేట్ల గురించి సినీ కార్మికుల బతుకు…
‘హృదయ కాలేయం, కొబ్బరి మట్ట’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు సంపూర్ణేశ్ బాబు. అతని తాజా చిత్రం ‘బజార్ రౌడీ’. డి. వసంత నాగేశ్వరరావు డైరెక్షన్ లో సంధిరెడ్డి శ్రీనివాసరావు ఈ సినిమా నిర్మించారు. శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో సంపూర్ణేష్ బాబు కి జోడిగా మహేశ్వరి వద్ది నటించింది. సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాయగా, ఎస్ఎస్ ఫ్యాక్టరీ…
2020 టోక్యో ఒలంపిక్స్ లో ఇండియా రజత పతక విజేత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు మెగాస్టార్ సెల్యూట్ చేశారు. “మీరాబాయి చాను దేశం గర్వించేలా ఒలంపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ గెలిచిన ఇండియన్. క్రీడల అనంతరం ఇంటికి చేరిన ఆమె అప్పటి నుంచి కొందరు వ్యక్తుల కోసం వెతుకుతూనే ఉంది. చివరికి వారందరినీ పిలిచి భోజనాలు పెట్టింది. మొత్తం 150 మంది. అందరికీ భోజనాలు పెట్టి, బట్టలు పెట్టి, కాళ్ళకి దణ్ణం…