నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయన నటించబోయే చిత్రాల సంబందించిన అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలను చిరు లైన్ లో పెట్టారు. ఇప్పటికే ఆచార్య (చిరు 152) సినిమాను పూర్తి చేసిన చిరు.. విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా…
మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇవాళ అభిమానులందరికీ ఫుల్ మీల్స్ దక్కినట్టు అయ్యింది. ‘ఆచార్య’ నయా పోస్టర్ రిలీజ్ దగ్గర నుండి రెండు కొత్త సినిమాల టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు మరో మూవీకి సంబంధించిన పోస్టర్ సైతం విడుదలైపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, బాబీ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ మూవీకి సంబంధించిన విశేషాలను మాత్రం చెప్పి, చెప్పకుండా దాటేశారు. మొదట తెలిపిన టైమ్ కు కేవలం పోస్టర్ ను మాత్రం విడుదల చేశారు.…
”సినిమా రంగానికి చెందిన 24 శాఖల కార్మికులు నివసిస్తున్న చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మించి ఇస్తానని మెగాస్టార్ చిరంజీవి మాటిచ్చారని చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రపురి కాలనీలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైటీ స్టార్ శ్రీకాంత్ అతిథిగా హాజరయ్యారు. బ్లడ్ డొనేషన్ చేసిన వారికి ప్రోత్సాహక బహుమతులను శ్రీకాంత్ చేతుల మీదుగా కమిటీ సభ్యులు అందజేశారు. ఈ…
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు (ఆగస్టు 22) తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సంతోషకరమైన సందర్భంలో ఆయనకు అభిమానుల నుంచే కాకుండా ప్రముఖుల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆయన సినిమాల నుంచి వరుస అప్డేట్స్ మెగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఉదయం మెహర్ రమేష్తో చిరంజీవి నెక్స్ట్ మూవీ టైటిల్ను మహేష్ బాబు ఆవిష్కరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు. మీ సినిమా టైటిల్ని ఆవిష్కరించడం గౌరవంగా ఉంది. “భోళా శంకర్”…
ఈరోజు మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియో ను పంచుకున్నాడు. “జీవితంలో మర్చిపోలేని క్షణాలు, నేను అప్పా అని పిలుస్తాను! నా ఆచార్య… పుట్టినరోజు శుభాకాంక్షలు!” అని చరణ్ ట్వీట్ చేశాడు. ఈ వీడియోలో తన తండ్రితో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఒక్క వీడియోతో తన తండ్రిపై ప్రేమ, ఆప్యాయతను తెలియజేశాడు చరణ్. మెగా తండ్రీ కొడుకులు ఇద్దరూ…
మెగాస్టార్ చిరంజీవి తన 66వ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆగస్టు 22ను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడానికి భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ట్విట్టర్ స్పేస్ సెషన్ లో పాల్గొని సందడి చేయనున్నారు. చిరుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోబోతున్నారు. చిరంజీవి ఫాలోవర్స్ మెగాస్టార్ పుట్టినరోజు ప్రత్యేక ట్విట్టర్ స్పేస్ సెషన్కు పిలుపు అందింది. ఈ రోజు ఈ ట్విట్టర్ స్పేస్ సెషన్లో పాల్గొనే ప్రముఖుల జాబితాను నిర్వాహకులు విడుదల…
తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అన్న పేరుతో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. ఆయన తరువాత ఆ స్థాయిలో నవలాచిత్రాలతో విజయం సాధించింది చిరంజీవి అనే చెప్పాలి. అక్కినేని లవ్ స్టోరీస్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో రూపొందిన నవలల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలలో నటించారు. అయితే చిరంజీవి కోసమే అన్నట్టుగా కొన్ని నవలలు యాక్షన్ ను కూడా జోడించాయి. సదరు నవలల ద్వారా చిరంజీవి నటునిగా మంచిపేరు సంపాదించారు. చివరకు మెగాస్టార్ గా జనం మదిలో నిలిచారు. ఆయన…
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అప్పిరెడ్డి ఫౌండేషన్, సోహిహెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలు శనివారం హైదరాబాద్ నగరంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. అప్పిరెడ్డి ఫౌండేషన్ అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డితోపాటు, సోహి హెల్పింగ్ హ్యాండ్స్, మైక్ మూవీస్, మైక్ టీవీ సంస్థల ప్రతినిధులు చక్రధర్ రావు, రవి రెడ్డి, చరిత్, సంపత్, జగ్గూ పాల్గొన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను సందర్శించి అక్కడివారికి అన్నదానంతోపాటు పళ్లు ఫలహారాలు అందించారు. చిరంజీవి చిరకాలం ఆయురోరాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.…
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు గత కొన్ని రోజుల నుండి సంబరాలు, సేవాకార్యక్రమాలు జరుపుతుంటే… తాజాగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఒకరోజు ముందు నుండే రావడం మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తొలిసారి సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ‘లూసిఫర్’ మూవీకి తెలుగు టైటిల్ ను ఖరారు చేశారు. దీనికి ‘గాడ్ ఫాదర్’ అనే పేరు పెట్టారు. రామ్ చరణ్ సమర్పణలో ఆర్. బి. చౌదరితో కలిసి ఎన్వీ…
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన జన్మదినం ఆగష్టు 22 సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొనాలని ట్విట్టర్ ద్వారా అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరిత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని చెప్పారు. అందుకు, యంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన హరితయజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో మీరంత పాల్గొనాలి, మూడు మొక్కలు నాటి, నాకు ట్విట్టర్ లో ట్యాగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. చిరు ట్వీట్…