చిరు సినిమాతో మణిశర్మ కొడుకు హవా మొదవుతుందా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, మణిశర్మ ది హిట్ కాంబినేషన్. ‘బావగారు బాగున్నారా!’ మొదలు ‘చూడాలని వుంది, అన్నయ్య, ఇంద్ర, ఠాగూర్, జై చిరంజీవ, స్టాలిన్’ వంటి ఎన్నో సినిమాలను సూపర్ హిట్ పాటలతో బంపర్ హిట్ గా మార్చాడు మణిశర్మ. తాజాగా ‘ఆచార్య’తో ఈ ఇద్దరు మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మణిశర్మ కుమారుడు మహతి సాగర్ తొలిసారి చిరంజీవితో పని చేయబోతున్నాడట. ‘వేదాళం’ రీమేక్ గా మెహర్ రమేశ్ తీస్తున్న ‘భోళా శంకర్’ సినిమాకు మణి కొడుకు సాగర్ ని సంగీత దర్శకుడుగా ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇప్పటికే ‘ఆచార్య’లో విడుదలైన పాటలతో తనదైన మార్క్ చూపించిన మణిశర్మకు ఈ వార్త ఎంతో ఆనందాన్ని ఇస్తుందనటంలో అతిశయోక్తి లేదు. చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ గా ‘గాడ్ ఫాదర్’ చేస్తున్నాడు. దానికి తమన్ సంగీత దర్శకుడు. దాని తర్వాత మెహర్ రమేష్‌తో ‘భోలా శంకర్’ పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి ట్యూన్స్ కంపోజ్ చేయడానికి మహతి స్వర సాగర్ సిద్ధం అవుతున్నారు. మహతి ఇప్పటికే ‘ఛలో’, ‘భీష్మ’ వంటి హిట్ సినిమాలకు సంగీతం అందించారు. ఇవి మ్యూజికల్ గా కూడా హిట్ అయ్యాయి. తండ్రిలాగే మెలోడి ట్యూన్స్ ఇవ్వటంలో దిట్ట మహతి సాగర్. దీంతో మెగాభిమానులు మణిశర్మ లాగే మహతి సాగర్ కూడా తమ బాస్ కి సూపర్ హిట్ మ్యూజిక్ అందిస్తాడనే ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి వారి ఆశకు తగినట్లు, తండ్రి ఆశయాలకు అనుగుణంగా చిరుకు సూపర్ మ్యూజిక్ ఇచ్చి తన దైన మార్క్ సృష్టిస్తాడేమో చూడాలి.
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!