చిత్రపురి కాలనీలో చిరంజీవి హాస్పిటల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
”సినిమా రంగానికి చెందిన 24 శాఖల కార్మికులు నివసిస్తున్న చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మించి ఇస్తానని మెగాస్టార్ చిరంజీవి మాటిచ్చారని చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రపురి కాలనీలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైటీ స్టార్ శ్రీకాంత్ అతిథిగా హాజరయ్యారు. బ్లడ్ డొనేషన్ చేసిన వారికి ప్రోత్సాహక బహుమతులను శ్రీకాంత్ చేతుల మీదుగా కమిటీ సభ్యులు అందజేశారు.
ఈ సందర్భంగా వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ ”రక్తదానం అంటే ప్రాణదానం చేయడమే. రక్తం సకాలంలో అందక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం వెళ్లి కలిసినప్పుడు చిరంజీవి గారు చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మిస్తానని మాటిచ్చారు. గతంలోనూ మా సినీ కార్మికుల సమస్యల గురించి చాలా సేపు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. చిత్ర పరిశ్రమకు దాసరి గారు లేని లోటు చిరంజీవి గారు తీరుస్తున్నారు. చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మాణానికి మాటిచ్చిన చిరంజీవి గారికి మొత్తం సినీ కార్మికుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని అన్నారు.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
చిత్రపురి హౌసింగ్ సొసైటీ కార్యదర్శి కాదంబరి కిరణ్ మాట్లాడుతూ ”చిత్రపురి కాలనీలో నిర్వహిస్తున్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ కు శ్రీకాంత్ గారు రావడం చిరంజీవి గారు వచ్చినట్లే ఉంది. చిరంజీవి గారి ప్రియ సోదరుడు శ్రీకాంత్ గారు. సినీ కార్మికులన్నా, పేదలన్నా చిరంజీవి గారికి ఎంతో ఇష్టం. సీసీసీ ద్వారా కరోనా కష్టకాలంలో ఆదుకున్నారు. చిరంజీవి గారు ఎంత పెద్ద స్టారో అంతే పెద్ద మనసున్న మనిషి” అని చెప్పారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, ”చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పేరు మీద బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం, రమ్మని అనిల్ గారు అడగ్గానే తప్పకుండా వస్తానని చెప్పాను. మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు ఇష్టం. అలా పాల్గొంటే ఆ పుణ్యం నాకు కూడా కొంత వస్తుందని నమ్ముతాను. చిత్రపురి కాలనీలో ఆసుపత్రి నిర్మిస్తానని మెగాస్టార్ చెప్పడం సంతోషంగా ఉంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రపురి కమిటీ సభ్యులు పీఎస్ఎన్ దొర, అళహరి, అనిత ఇతర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!