మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా నిన్నంత మెగా వేవ్ నడిచింది. ఆయన చేయబోయే ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. ప్రస్తుతం ‘ఆచార్య’ పూర్తిచేసిన మెగాస్టార్, విడుదల కోసం చూస్తాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత చిరు మూడు సినిమాలు చేయనున్నాడు.
మోహన్ రాజా డైరెక్షన్ లో ‘గాడ్‌ఫాదర్’.. బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ (పరిశీలన టైటిల్).. మెహర్ రమేష్‌తో ‘బోళా శంకర్’ సినిమాలు చేయనున్నాడు మెగాస్టార్. వచ్చే ఏడాది చివరి వరకు ఈ చిత్రాలతో చిరు బిజీగా ఉండనున్నాడు. అయితే, ఓ యువ దర్శకుడితోను చిరు 156 సినిమా ఉంటుందని, దీనికి సంబందించిన అనౌన్స్ మెంట్ కూడా ఉంటుందని ఎక్ప్ పెక్ట్ చేశారట. అయితే ఇప్పటికే మెగా బండి లోడ్ ఎక్కువ అవ్వడంతో ఆ అప్డేట్ ఆపేశారని తెలుస్తోంది. అంతేకాదు, ఆ సినిమా కథ విషయంలోనూ చిరు కొన్ని మార్పులు-చేర్పులు చేయాలని కోరాడట. మరి ఆ యంగ్ దర్శకుడు ఎవరు..? చిరుతో ఆయన సినిమా ఉండనుందా..? తెలియాలంటే కొద్దిరోజులు వరకు ఆగాల్సిందే..!