చిరంజీవి, కె.యస్. రామారావు కాంబినేషన్ అనగానే గతంలో వారిద్దరి కలయికలో వచ్చిన సూపర్ హిట్స్ గుర్తుకు వస్తాయి. ‘అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, స్టువార్టుపురం పోలీస్ స్టేషన్’ వంటి సినిమాలు వీరి కలయిలో రూపొందాయి. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీరి కలయికలో సినిమా రాబోతోంది. 1991లో వచ్చిన ‘స్టూవార్ట్ పురం పోలీస్ స్టేషన్’ తర్వాత వస్తున్న సినిమా ఇది. గత కొద్ది సంవత్సరాలుగా చిరంజీవితో సినిమా చేయాలని తాపత్రయపడుతున్న కె.యస్.రామారావు కోరిక నెరవేరనుంది. ఇటీవల కాలంలో కె.యస్. రామారావును వరుస పరాజయాలు పలకరించాయి. ఇప్పుడు చిరంజీవి సినిమా చేస్తుండటం క్రియేటివ్ కమర్షియల్స్ కు కొత్త ఊపు ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also : ట్రెండింగ్ లో “బాయ్ కాట్ సల్మాన్ ఖాన్”… ఏం జరిగిందంటే ?
చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వేదాళం’ రీమేక్ కి కె.యస్. రామారావుని కూడా భాగం చేశారు చిరంజీవి. ఈ సినిమాకి మరో నిర్మాత అనిల్ సుంకర. ఈ సినిమాకు ‘భోళా శంకర్’ అనే టైటిల్ నిర్ణయించారు. చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. పూర్తిస్థాయి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో అభిమానులకు కిక్ ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. సో ఈ సినిమాతో చిరు, కె.యస్. రామారావు మరోసారి ఆడియన్స్ మెప్పుపొందుతారని ఆశిద్దాం.