God Father: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు విడుదల కాగానే ఎక్కువ రేట్లకు టిక్కెట్లు అమ్ముకోవడం.. చిన్న సినిమాలు రాగానే ఆ ధరలను తగ్గించడం జరుగుతోంది. ఇటీవల కాలంలో పెట్టుబడులు రావాలంటే టిక్కెట్ల ధరలను పెంచడమే ప్రత్యామ్నాయంగా ఇండస్ట్రీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే విచిత్రంగా దసరా కానుకగా విడుదలయ్యే పెద్ద సినిమాల టిక్కెట్ ధరలను మాత్రం సాధారణ రేట్లకే విక్రయిస్తున్నారు. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ వంటి సినిమాల బుకింగ్స్ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి.…
Megastar Chiranjeevi: గాంధీ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అహింస, సత్యం, సరళమైన ఆలోచనల శక్తి వంటి పదాలకు మహాత్మాగాంధీ గొప్ప ఉదాహరణగా నిలిచిపోయారని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో కొనియాడారు. గాంధీజీ ఆదర్శాలు ఎప్పటికీ నిలిచిపోతాయని.. ఆయన ఆదర్శాలు అన్నింటినీ జయిస్తాయని చిరు పేర్కొన్నారు. కాగా చిరంజీవి ఇంకా గాంధీ స్థాపించిన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటీవల ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డు కూడా జారీ చేసింది.…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి లేటెస్టుగా నటిస్తున్న మూవీ గాడ్ ఫాదర్. ఈ మూవీలో ఓ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. తన నుంచి రాజకీయాలు దూరంగా లేవని గాడ్ ఫాదర్ సినిమాలో చిరు చెప్పిన డైలాగ్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి కొత్త ఐడీ కార్డు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని పీసీసీ డెలిగేట్‌గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ…
Chiranjeevi: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 60 ఏళ్ల మహిళకు ట్యాబ్‌లో ‘అడవి దొంగ’ సినిమా చూపిస్తూ వైద్యులు ఎలాంటి మత్తు మందు ఇవ్వకుండా మహిళ మెదడులో కణతులు తొలగించారు. ఆపరేషన్ చేస్తున్న వైద్యులు మధ్యమధ్యలో మహిళతో మాటలు కలుపుతూ విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ వార్త శుక్రవారం నాడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన తన పీఆర్వో ఆనంద్‌ను గాంధీ ఆస్పత్రికి…
Naga Babu: ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు. ఈనెల 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా మెగా గ్రాండ్ కార్నివల్‌ను నిర్వహిస్తున్నట్లు నాగబాబు స్పష్టం చేశారు. 20 ఏళ్లకు పైగా మెగా అభిమానులు చూపించే ఆదరాభిమానాలను దృష్టిలో ఉంచుకుని వాళ్లకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసినట్లు నాగబాబు తెలిపారు. తెలుగులో చెప్పాలంటే ఇదొక జాతర మాదిరిగా ఉంటుందన్నారు. గోవా…
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో అమీర్‌ఖాన్ హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ప్రత్యేకంగా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ ప్రివ్యూ షోకు అమీర్‌ఖాన్, చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, సుకుమార్ కూడా హాజరయ్యారు. ఈ సినిమా వీక్షించిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ సినిమాలో అమీర్ ఖాన్, నాగచైతన్య చాలా…
మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం ఉండేదని కోహ్లీ చిన్ననాటి స్నేహితుడు, తెలుగు క్రికెటర్ ద్వారక రవితేజ అన్నాడు. యూకేలో విరాట్ కోహ్లీని కలిసినట్లు రవితేజ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సుమారు ఆరేళ్ల తర్వాత కోహ్లీ, తాను కలుసుకున్నామని.. వెంటనే విరాట్ నన్ను చిరు ఎలా ఉన్నావ్ అంటూ ఆప్యాయంగా పిలిచాడని రవితేజ వివరించాడు. అండర్-15…
స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా జూలై 4న ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొననున్నారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని ఏపీలోని పలువురు ప్రముఖులకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానాలు పంపుతున్నారు. కిషన్‌రెడ్డి ఆహ్వానం పంపిన వారి జాబితాలో చిరంజీవి కూడా ఉన్నారు. Read Also:…