మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది నటించిన “భోళా శంకర్” మూవీ మెగా ఫ్యాన్స్ కి ఓ చేదు జ్ఞాపకంగా మిలిపోయింది. ఆ సంవత్సరం వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మెగా స్టార్ భోళా శంకర్ సినిమాతో అంతకన్నా దారుణమైన డిజాస్టర్ ను అందుకున్నారు..భోళా శంకర్ తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కి రీమేక్. అయితే భోళా శంకర్ సినిమా పై ఫ్యాన్స్ లో ముందు నుండి అనుమానాలు ఉన్నాయి. దానికి కారణం…
Mega Fans Focus on Operation Valentine: మెగా హీరోల్లో ఒక్కడే ఫామ్‌లో వున్నాడు. రెండేళ్ల క్రితం పుష్పతో హిట్ కొట్టిన అల్లు అర్జున్ తప్ప మరో హీరో లేడు. అదేమిటో మెగా హీరోలను ఫ్లాపులు వెంటాడుతున్నాయి. ఫెయిల్యూర్స్‌లో ఉన్న మెగా ఫ్యామిలీని వరుణ్‌తేజ్ గాడిలో పెడతాడా? అనే అంశం మీద చర్చ జరుగుతోంది. చిరంజీవి కెరీర్‌లో ఆచార్యనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అనుకుంటే.. భోళా శంకర్ అంతకు మించి నష్టాలు తీసుకొచ్చింది. భోళా తర్వాత నటిస్తున్న విశ్వంభర’ను…
వెండితెర రారాజులా.. మెగా మహారాజులా.. ‘స్వయంకృషి’కి చిరునామాలా.. అభిమానుల ‘విజేత’గా.. అన్నార్తులకు అపద్బాంధవుడుగా.. అభిమానులకు అన్నయ్యగా.. అనుభవంలో మాస్టర్‌గా.. హోల్ ఇండస్ట్రీకి మెగాస్టార్‌గా ఎదిగిన నిలువెత్తు సినీ శిఖరం చిరంజీవిని భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. అత్యున్నత గౌరవం అందుకున్న చిరంజీవికి అదే స్థాయిలో శుభాకాంక్షలు తెలిపారు తెలుగు ఎన్నారైలు. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై చిరంజీవి సినీ లైఫ్ జర్నీ వీడియోను ప్రదర్శించారు. ఈ అరుదైన సన్నివేశం అందరిని ఆకట్టుకుంది. మెగా…
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మెగా అభిమాన సంఘాల నాయకులతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేప పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. అంధకారంలోకి వెళ్లిపోతున్న ఏపీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. అభిమాన సంఘాలు రాజకీయ ప్రక్రియలో భాగంగా మారి బాధ్యత తీసుకోవాలని కోరారు. 2019 ఎన్నికల్లో జరిగిన పొరపాటు మళ్లీ…
పొద్దున్నే ప్రముఖ దర్శకనిర్మాత రామ్ గోపాల్ వర్మ దృష్టి, స్టార్ కపుల్ ధనుష్, ఐశర్వ విడాకుల మీద పడినట్టుగా ఉంది. సహజంగా పెళ్ళంటే పడని వర్మ ఎప్పటిలానే పెళ్ళి – దాని పర్యవసానాలపై నాలుగైదు ట్వీట్స్ పెట్టేశాడు. బట్ ఆ పోస్టులు, దానికి వచ్చిన స్పందన వర్మకు పెద్దంత కిక్ ఇచ్చినట్టు లేవు. ఇక మెగా ఫ్యామిలీ మీద పడ్డాడు. ‘అంగీకరించడానికి కష్టంగా ఉన్నా ఇక ‘అల్లు’ అనేది కొత్త ‘మెగా’! అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో…
ఆధ్యాత్మిక నగరం తిరుమల, తిరుపతిలో జలప్రళయం, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలిచివేస్తున్నాయి. ప్రభుత్వం, టీటీడీ సాధ్యమైనంత త్వరగా పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలని కోరుతున్నా. అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూత ఇవ్వాలని కోరుతున్నా’ అంటూ ట్విట్టర్‌లో చిరంజీవి పోస్ట్ చేశారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం…
కరోనా క్రైసిస్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన సంగతి తెలిసిందే. ఈ సేవల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్రతినిధులు పాలుపంచుకున్నారు. అందుకే ఆదివారం రోజు తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజన్ సేవల్లో పాల్గొన్న ప్రతినిధుల్ని పిలిచి మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేదికపై అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు…