Megastar Fans: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై చిరు సినీ లైఫ్ జర్నీ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండితెర రారాజులా.. మెగా మహారాజులా.. ‘స్వయంకృషి’కి చిరునామాలా.. అభిమానుల ‘విజేత’గా.. అన్నార్తులకు అపద్బాంధవుడుగా.. అభిమానులకు అన్నయ్యగా.. అనుభవంలో మాస్టర్‌గా.. హోల్ ఇండస్ట్రీకి మెగాస్టార్‌గా ఎదిగిన నిలువెత్తు సినీ శిఖరం చిరంజీవిని భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. అత్యున్నత గౌరవం అందుకున్న చిరంజీవికి అదే స్థాయిలో శుభాకాంక్షలు తెలిపారు తెలుగు ఎన్నారైలు. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై చిరంజీవి సినీ లైఫ్ జర్నీ వీడియోను ప్రదర్శించారు. ఈ అరుదైన సన్నివేశం అందరిని ఆకట్టుకుంది. మెగా అభిమాని, తెలుగు ఎన్నారై రాజ్ అల్లాడ ఆధ్వర్యంలోని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారైల సంఘాల ప్రతినిధులు పాల్గొని కేక్ కట్ చేసి చిరంజీవికి శుభాకాంక్షలు అందించారు. తమ అభిమాన హీరో చిరంజీవి భవిష్యత్‌లో భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకోవాలని ఆకాంక్షించారు.
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై చిరంజీవి సినిమాల్లోని దృశ్యాలను ప్రదర్శించారు. ఆ సమయంలో ”స్టార్.. స్టార్.. మెగాస్టార్..” అంటూ ఆ ప్రాంగణమంతా అభిమానుల నినాదాలతో హోరెత్తిపోయింది. ఇక ప్రజాసేవ కేటగిరిలో పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడుకు కూడా తెలుగు ఎన్నారైలు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ నుంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ఎన్నారైల తెలుగు సంఘాలు NATS, MATA, Atmiya, AptA, TANA, NATA, AAA, NRIVA, TTA, NASAA, TFAS, ISANA సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగా గ్రూప్ లీడర్స్… ఓం ప్రకాశ్ నక్కా, విజయ్ రామిశెట్టి, బుల్లి కనకాల, గోపికృష్ణ గుర్రం, ఆనంద్ చిక్కాల, వెంకట్ నాగిరెడ్డి, లక్ష్మణ్ నాయుడు, అనిల్ కుమార్ వీరిశెట్టి, వంశీ కొప్పురావూరి తమ సహాయ సహకారాలు అందించారంటూ వారికి రాజ్ అల్లాడ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!