మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది నటించిన “భోళా శంకర్” మూవీ మెగా ఫ్యాన్స్ కి ఓ చేదు జ్ఞాపకంగా మిలిపోయింది. ఆ సంవత్సరం వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మెగా స్టార్ భోళా శంకర్ సినిమాతో అంతకన్నా దారుణమైన డిజాస్టర్ ను అందుకున్నారు..భోళా శంకర్ తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కి రీమేక్. అయితే భోళా శంకర్ సినిమా పై ఫ్యాన్స్ లో ముందు నుండి అనుమానాలు ఉన్నాయి. దానికి కారణం మెహర్ అన్న ట్రాక్ రికార్డ్.వరుస డిజాస్టర్స్ తో డైరెక్షన్ కి దూరమైన మెహర్ రమేష్ కి చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు..అసలు ఫార్మ్ లో లేని దర్శకుడికి మెగాస్టార్ ఛాన్స్ ఎందుకు ఇచ్చారని ఫ్యాన్స్ భయపడిపోయారు. అయితే ఫ్యాన్స్ ఊహించినట్లుగానే భోళా శంకర్ మూవీ చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది.
ఈ సినిమా విషయంలో చిరంజీవి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఫ్యాన్స్ కూడా రీమేక్స్ చేయొద్దని చిరంజీవిని వేడుకోవడం జరిగింది.దయచేసి రీమేక్స్ చేయడం ఆపేయండి. అలాగే మెహర్ రమేష్ వంటి దర్శకులకు అవకాశం ఇవ్వొద్దని చిరంజీవికి సలహాలు ఇచ్చారు. భోళా శంకర్ రిజల్ట్ దెబ్బకు చిరంజీవి మలయాళ రీమేక్ బ్రో డాడీని పక్కన పెట్టారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్ పై దృష్టి పెట్టారు. అయితే ఈ మూవీ సెట్స్ లో చిరంజీవిని మెహర్ రమేష్ కలిశాడు. ఈ ఫోటోలు మెహర్ రమేష్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.అవి చూసిన చిరంజీవి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ షురూ చేసారు. మెహర్ అన్నా మా చిరు అన్నని వదిలేయ్ అన్నా అని ప్రాధేయ పడుతున్నారు.