రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏ సినిమా తెరకెక్కింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా మీద హైట్ అంతకంతకు పెరుగుతూ వెళ్ళింది. ఇక తాజాగా విజయవాడలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ కటౌట్ ఒకదాన్ని లాంచ్ చేశారు. ఆ లాంచ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ నుంచి దిల్ రాజు విజయవాడ వెళ్లారు. ఆ కటౌట్ లంచ్ తర్వాత హెలికాప్టర్ ద్వారా పూలాభిషేకం జరిపించి ఆ తర్వాత దిల్ రాజు అక్కడే అభిమానులతో ముచ్చటించారు. అయితే ఈ ముచ్చటిస్తున్న క్రమంలోనే మెగా అభిమానుల ఆనందాన్ని మరింత పెంచే విధంగా ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి చూశారని సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని ఈసారి పండుగ మనదేనని అభిమానులకు చెప్పాలని చెప్పినట్లు వెల్లడించారు.
Unstoppable With NBK S4: బాలయ్యతో రామ్ చరణ్.. మాములుగా ఉండదు మరి!
ఒక రకంగా ఈసారి సంక్రాంతి మనదే అంటూ మెగాస్టార్ చెప్పినట్లు దిల్ రాజు చెప్పడంతో అభిమానుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టే ఈ సినిమాతో రామ్ చరణ్ తేజ నట విశ్వరూపం కూడా చూస్తారని ఆయన అన్నారు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా, పోలీస్ అధికారిగా, పొలిటికల్ లీడర్ గా ఇన్ని పార్స్యాలలో తన నటనను చూపిస్తారని ఆయన అన్నారు. అంతే కాదు సినిమా సాంగ్స్ కోసమే 75 కోట్లు ఖర్చయ్యాయని శంకర్ మార్క్ సాంగ్స్ రామ్ చరణ్తో చూస్తారని ఆయన పేర్కొనడంతో ప్రస్తుతానికి మెగా అభిమానులు అందరూ ఒక రకమైన హై ఎంజాయ్ చేస్తున్నారు. మామూలుగానే సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసే దిల్ రాజు రామ్ చరణ్ తేజ నోటా విశ్వరూపం మెగాస్టార్ చిరంజీవి ఈసారి పండుగ మనదే అన్నారని అనడంతో అంచనాలు మరింత పెరిగాయి. మరి చూడాలి ఏం జరగబోతోంది అనేది.