Rahul Gandhi Meeting: రాహుల్ గాంధీతో భేటీ కానున్న.. భారతీయ అమెరికన్ చట్టసభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Meeting: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యులు భేటీకానున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు కోరినట్టు కాంగ్రెస్ సీనియర్ ఆఫీస్ బేరర్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ఢిల్లీని సందర్శించిన ప్రతినిధి బృందంలో భాగమైన భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యులు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో ప్రైవేట్ సమావేశాన్ని షెడ్యూల్ చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్ ప్రవీణ్ చక్రవర్తి ధృవీకరించారు. అయితే వారు ఫార్మల్‌గా కలవాలని అనుకుంటున్నారా? లేకపోతే అధికారికంగా కలవాలనుకుంటున్నారా? అనేది తేలాల్సి ఉంది. యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందంలోని కొంతమంది సభ్యులు గత రెండు రోజులుగా రాహుల్ గాంధీతో వ్యక్తిగత సమావేశం కావాలని కోరుతూ సంప్రదించారని… రాహుల్ గాంధీ వాయనాడ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఏదైనా షెడ్యూల్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పినట్టు కాంగ్రెస్ నాయకుడు తెలిపారు.
Read also: Vyooham Teaser 2 : నిజం తన షూ లేస్ కట్టుకునే లోపే అబద్దం ప్రపంచమంతా ఒక రౌండ్ వేసి వస్తుంది..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
అధికారిక సమావేశం ఏర్పాటు చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి ఉంటుందా అని కాంగ్రెస్ ప్రతినిధిని ప్రశ్నించగా.. అందుకు అది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు అమెరికా ప్రతినిధి బృందం మధ్య ఉంటుందని.. అయితే ప్రతిపక్షంలోని ఒప ప్రధాన నాయకున్ని కలవడానికి అమెరికా చట్టసభ్యులు ఆశిస్తున్నప్పుడు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆందోళన చెందాల్సిన అవసరం ఏముంటుందని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. అమెరికా ప్రతినిధి బృందం ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేతతో సమావేశం కావాలనుకుంటే తప్పేముందన్నారు. రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష నాయకులను కూడా కలుస్తారా అని అడిగినప్పుడు, యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధి RO ఖన్నా, కొంతమంది వ్యక్తులను యుఎస్ ప్రతినిధి బృందం కలవాలని కోరుకుంటున్నారని ప్రశ్నించగా.. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అభ్యర్థనలను ఆమోదించాల్సి ఉంటుందన్నారు. తాము ఈ అభ్యర్థనను చేయలేదని రాహుల్ గాంధీ కార్యాలయం స్పష్టం చేసింది.
తాను మరియు ప్రతినిధి బృందం ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖకు అతిథులుగా ఉన్నామని.. వారే దానిని ఏర్పాటు చేయవలసి ఉంటుందని ఖన్నా తెలిపారు. అభ్యర్థనను విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేశాను వారు చెప్పేదాన్ని బట్టి ఉంటుందని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..