Pakistani Slogans In MP Asaduddin Owaisi Meeting:ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్న సభలో కలకలం రేగింది. ఆయన సభలో ఓ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాక్ అనుకూల నినాదాలు చేశాడు. దీంతో పోలీసులు దాయాది దేశానికి అనుకూలంగా నినాదాలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా సదరు వ్యక్తితో పాటు ఎంఐఎం అభ్యర్థి ఎండీ అబ్దుల్ మొబిన్ రిజ్వి, నిర్వాహకుడు ముజఫర్ హసన్ నురానీతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డుమరీ ఎమ్మెల్యే జగర్నాథ్ మహ (జేఎంఎం) మృతి చెందారు. ఈ కారణంగా ఖాళీ అయిన ఆ స్థానానికి సెప్టెంబరు 5న ఉప ఎన్నిక జరగనుంది. కాగా ఓట్ల లెక్కింపు సెప్టెంబర్ 8 వ తేదీన జరగనుంది. ఈ స్థానంలో పోటీకి దిగిన మజ్లిస్ అభ్యర్థి అబ్దుల్ మొబిన్ రిజ్వికి మద్దతుగా బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఆ సభలో అసదుద్దీన్ పాల్గొన్నారు.
Also Read: Adani Group: అదానీ గ్రూప్‌పై మళ్లీ ఆరోపణలు.. పాత స్టోరీకి కొత్త స్కీన్ ప్లే అంటున్న కంపెనీ
ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే ఎవరో ఓ వ్యక్తి పాకిస్తాన్ కు అనుకూల నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కొంతమందిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా, మత సామరస్యానికి భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు డుమరీ పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే తమ అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఎంఐఎం నేతలు మండిపడుతున్నారు. అది ట్యాంపరింగ్ వీడియో అని ఝార్ఖండ్ ఎంఐఎం అధ్యక్షుడు ఎం.డి.షాకీర్ తెలిపారు. కావాలనే తాము గెలవకూడదనే తమపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నారు. ఇక గతంలో కూడా అసదుద్దీన్ సభలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక జార్ఖండ్ లో మూక దాడులు ఆగిపోయాయని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చెప్పినప్పటికీ ఇంకా అవి కొనసాగుతున్నాయని అసదుద్దీన్ సభలో మండిపడ్డారు. అంతేకాకుండా దీనిపై కాంగ్రెస్, ఆర్జేడీ కూడా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయాయాని అసహనం వ్యక్తం చేశారు అసదుద్దీన్.