కీచకుడి కామ దాహానికి మెడికల్ విద్యార్థిని బలైపోయింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న మెడికల్ విద్యార్థిని అదే ఆస్పత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న కీచకుడు వంచించాడు. పెళ్లి చేసుకుంటానని ని నమ్మించి మోసం చేయడాన్ని తట్టుకోలేకపోయింది ఆ యువతి. మరణమే శరణ్యం అనుకుంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడి 12 రోజులు పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది.
లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పార్మసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. 12 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ వెంటిలేటర్ పైనే ఉన్న నాగాంజలి.. ఈరోజు తుది శ్వాస విడిచింది. పోస్టుమార్టం నిమిత్తం నాగాంజలి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల వలనే తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని నాగాంజలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడు దీపక్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నాగాంజలి…
లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థి నాగాంజలి మృతి చెందింది. పది రోజులుగా ప్రాణాలతో పోరాడి.. రాత్రి రెండు గంటల సమయంలో కన్నుమూసింది. నాగాంజలి మృతి చెందినట్లు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్దకు వైద్య బృందం చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా కిమ్స్ హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. Also Read: Pregnant Woman: ఆస్పత్రికి డెలివరీకి వెళ్లిన…
గుజరాత్ రాష్ట్రం పటాన్‌లోని ధర్‌పూర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సీనియర్ల ర్యాగింగ్ కారణంగా ఓ వైద్య విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన తర్వాత, కళాశాల అడ్మినిస్ట్రేషన్ 15 మంది సీనియర్ విద్యార్థులను అకడమిక్, హాస్టల్ కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేసింది.
Radha Family: కోవర్టు అనే అనుమానంతో నక్సలైట్లు తమ సహచరురాలిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మావోయిస్టులు మెడికల్ స్టూడెంట్ రాధను హతమార్చిన ఘటనపై రాధా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోవర్టు అనే అనుమానంతో నక్సలైట్లు తమ సహచరురాలిని హత్య చేశారు. మావోయిస్టులు మెడికల్ స్టూడెంట్ రాధను హతమార్చారు. రాధా అలియాస్ నీల్సో ఆరేళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరింది. పోలీసులకు కోవర్టు మారిందని సమాచారంతో మరణశిక్ష మావోయిస్టు పార్టీ విధించింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను మరువక ముందే హర్యానాలో మరో ఘటన చోటుచేసుకుంది. కోల్‌కతా ఘటన జరిగిన కొన్ని రోజులకే రోహ్‌తక్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సీనియర్ వైద్యుడు దాడికి పాల్పడ్డాడు.
Vijayawada Medical Student Dies in Chicago: ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి ఆశలు ఆవిరయ్యాయి. విజయవాడకు చెందిన వైద్య విద్యార్థిని కారులో ప్రయాణిస్తూ మృతి చెందింది. కారులో గ్యాస్ లీక్ అవ్వడంతో వైద్య విద్యార్థిని దుర్మరణం పాలైంది. యువతి మరణంతో విజయవాడలోని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విద్యార్థిని మృతికి సంబంధించి వైద్య నివేదిక రావాల్సి ఉంది. వివరాల మేరకు.. విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్…
మానస ఆత్మహత్య అనంతరం పోస్టు మార్టం పూర్తి అయ్యింది. బంధువులు హన్మకొండకు తీసుకుని వెళ్లారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదని బందువులు అంటున్నారు.