Pharmacist Death Case: కీచకుడి కామ దాహానికి మెడికల్ విద్యార్థిని బలైపోయింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న మెడికల్ విద్యార్థిని అదే ఆస్పత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న కీచకుడు వంచించాడు. పెళ్లి చేసుకుంటానని ని నమ్మించి మోసం చేయడాన్ని తట్టుకోలేకపోయింది ఆ యువతి. మరణమే శరణ్యం అనుకుంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడి 12 రోజులు పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. నిందితుడైతే కటకటాల పాలయ్యాడు. కానీ, సూసైడ్ నోట్ లో ఆఖరి కోరిక తీరుతుందా…! రాష్ట్రంలో సంచలనం కలిగించిన రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ లో పనిచేస్తూ మృతి చెందిన నాగాంజలి ఘటనపై క్రైమ్ రిపోర్ట్.. అసలు ఏం జరిగిందంటే..
రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఫార్మాలాజిస్ట్ గా పనిచేస్తున్న నాగాంజలి గత నెల 23న అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది . ఫార్మా విద్యార్థిని నాగాంజలి 12 రోజులుగా వెంటిలేటర్ పై మృత్యువుతో పోరాడింది. ఇవాళ తెల్లవారుజామున నాగాంజలి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. బీఫార్మసీ చివరి ఏడాది చదువుతూ కిమ్స్ ఆసుపత్రిలో ఫార్మాలాజిస్ట్ గా పని చేస్తున్న ఏలూరు జిల్లా జీలుగుమిల్లికి చెందిన నాగాంజలిని ఇదే ఆస్పత్రికి చెందిన. ఏజీఎం దీపక్ లైంగికంగా వేధించాడు. గత నెల 23న అధిక డోసేజ్ మత్తు ఇంజక్షన్ తీసుకుని నాగాంజలి కోమాలోకి వెళ్లింది. అయితే, డైరీలో రాసుకున్న సూసైడ్ లెటర్స్ ద్వారా ఈమె ఎదుర్కొన్న దారుణం వెలుగులోకి వచ్చింది. గత నెల 27న నిందితుడు దీపక్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తమ ఏకైక కుమార్తెకు ఇలాంటి పరిస్థితి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు అనంతలక్ష్మి, సుబ్బారావులు డిమాండ్ చేస్తున్నారు. నాగాంజలికి ఇంజక్షన్ తీసుకుందా లేక నిందితుడే ఇచ్చాడా..?ఈమెను వేధించిన వారిలో ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే అనుమానాలు ఉన్నాయి.
తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు, రాజకీయ పార్టీలు బాధిత కుటుంబానికి అండగా నిలిచాయి. ఈ కేసులో న్యాయం జరిగేలా అండగా ఉంటామని మాజీ సీఎం వైఎస్ జగన్ నాగాంజలి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. రిమాండ్ లో ఉన్న నిందితుడు దీపక్ ను కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడతామని పోలీసులు అంటున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో. వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి నాగాంజలి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత ఆమె స్థలమైన ఏలూరు జిల్లా జీలిగుమిల్లీ మండలం రౌతుగూడెంకి మృతదేహాన్ని చేర్చారు అధికారులు.. అయితే, అంజలి మృతి ఘటనపై న్యాయం చేయాలని బంధువుల డిమాండ్ చేస్తున్నారు.. పెళ్లి అయిన 12 ఏళ్లకు లేక లేక పుట్టిన ఒక్కగాని ఒక కుమార్తె నాగాంజలి. అల్లరి ముద్దుగా పెంచుకున్న కుమార్తె కోసం ఉన్న మూడున్నర ఎకరాల భూములను అమ్మేసి బి .ఫార్మసీ వరకు చదివించారు. మరో రెండు మూడు నెలల్లో బి ఫార్మసీ పూర్తి చేసి సర్టిఫికెట్ పొందుతున్న సమయంలో తల్లిదండ్రులు విషాద సంఘటనకు తల్లాడిల్లిపోతున్నారు.
బి ఫార్మసీ చివరి సంవత్సరం చదువుతున్న నాగాంజలి ఇన్ టెన్షిప్ కోసం రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ లో మూడు నెలల క్రితం జాయిన్ అయింది. ఇదే హాస్పటల్లో ఏ.జి.ఎం.గా పనిచేస్తున్న దీపక్ ప్రేమ వలలో పడింది. ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్ కు రెడ్ శారీ కట్టుకొని వెళ్లింది. అదే రోజు కిమ్స్ ఏజీఎం దీపక్ కామదాహానికి బలైపోయింది. ఇదే విషయం నాగాంజలి రాసుకున్న సూసైడ్ నోట్‌లో పేర్కొంది. నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తర్వాత దొరికిన సూసైడ్ నోట్‌లో తాను ఎందుకు చనిపోవాలనుకున్నది రాసుకుంది. ఈ సూసైడ్ లెటర్ ఆధారంగా రాజమండ్రి.. ప్రకాష్ నగర్ పోలీసులు నిందితుడు దీపక్ ను అరెస్టు చేశారు..రాజమండ్రిలోని కిమ్స్ ఆస్పత్రి ఏజీఎం దీపక్ లైంగిక వేధింపులు తాళలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రోజులు గడుస్తున్న కొద్దీ దీపక్ చేష్టల గురించి కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి, 2019లో కిమ్స్ హాస్పిటల్ లో చేరి. అంచెలంచెలుగా ఏజీఎం స్థాయికి ఎదిగిన దీపక్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి యువతులను, మహిళలను ప్రేమ పేరుతో మోసగించి, తర్వాత లైంగిక వేధింపులకు గురి చేస్తాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీపక్ కు పిల్లనిచ్చిన మామ టిడిపి నేత కావడం, కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం బంధువు అవ్వడంతో బాధితులు ఎవరు ఫిర్యాదు చేయాలనే ధైర్యం చేయలేకపోయారనే విమర్శలు ఉన్నాయి..
దీపక్ గతంలో హోమియోపతి కళాశాలలో లెక్చరర్‌ను వేధించి డీబార్ అయిన చరిత్ర ఉంది. 2015లో రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఇప్పటికీ కోర్టు వాయిదాలకు తిరుగుతున్నాడు. ఈ కేసులో గతనెల 15వ తేదీన కోర్టు వాయిదా కూడా హాజరయ్యాడు. కిమ్స్ ఆస్పత్రిలో చేరిన నాటి నుండి దీపక్, డ్యూటీ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీపక్ వేధింపులను తట్టుకోలేక పదుల సంఖ్యలో సిబ్బంది ఆస్పత్రి వదిలి వెళ్లినట్లు సమాచారం. దీపక్ వేధింపులు తట్టుకోలేక డ్యూటీ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు.. ఇలా వివిధ హోదాల్లో పనిచేసే సిబ్బంది వేధింపులపై ఫిర్యాదు చేస్తే తమ పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవరూ ముందుకు రాలేదు. గతంలో ఇద్దరు సిబ్బందిని బ్లాక్ మెయిల్ చేసిన వ్యవహారంలో ఆస్పత్రి యాజమాన్యం మందలించినా దీపక్ వ్యవహార శైలిలో మార్పులేదు. ప్రేమ పేరిట మాయమాటలు చెబుతూ.. లైంగిక వాంఛలు తీరాక సదరు యువతులు, మహిళలను వదిలించుకోవడం దీపక్ నైజమని, ఈ విషయంలో ఇతడు ఎంతకైనా తెగిస్తాడని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం ఆత్మహత్య చేసుకుని మరణించిన విద్యార్థినిపై సైతం వేధింపులకు ఒడిగట్టడంతో వీటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఆమె.. మెదడు దెబ్బతినే ఇంజెక్షన్ చేసుకున్నట్టు తెలిసింది. దీపక్ వేధింపులకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వెలుగు చూశాయి. ఏజీఎం దీపక్ తనను కొట్టి, గాయపరిచిన ఫొటోలను బాధిత విద్యార్థిని ఎప్పటికప్పుడు సెల్ ఫోన్‌లో తీసుకుని భద్రపరుచుకున్నట్టు సమాచారం. తన శరీరంపై గాయాలైన భాగాలను ఈమె ఫోటోలు తీసింది. వీటిని పరిశీలిస్తే ఇతగాడి క్రూరత్వం ఎలాంటిదో తెలుస్తోంది. దీపక్ కర్కశత్వాన్ని చూసి ఆస్పత్రి సిబ్బంది సైతం అవాక్కవుతున్నారు. ఘటన జరిగిన రోజు కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం సీసీ పుటేజీ బహిర్గతం చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనతో యువతులు, మహిళల భద్రత పట్ల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని బాధ్యులను శిక్షించాలనే అభ్యర్థనలు వినిపిస్తున్నాయి.
కిమ్స్ హాస్పిటల్ ఏజీఎం దీపక్ పై. ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోటు ఆధారంగా రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల దీపక్ ను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం దీపక్ రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. దీపక్ పై ఉన్న ఆరోపణలు పట్ల పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. దీపక్ ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. మెడికల్ విద్యార్థిని అంజలి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని రాజమండ్రి డిఎస్పి రమేష్ బాబు అంటున్నారు. నాగాంజలి మృతికి కారణంగా నిందితుడు దీపక్ పై హత్య కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఇంతకు ముందు పెట్టిన కేసులను మారుస్తున్నామని వెల్లడించారు. మృతురాలి సూసైడ్ నోటు, ఘటనకు సంబంధించి హాస్పటల్లో సీసీ కెమెరా విజువల్స్, సేకరించామని, నాగంజలి రూమ్ మెట్స్ ని కూడా. విచారించామని అన్నారు. సమగ్ర దర్యాప్తు కోసం దీపక్ ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరామని అంటున్నారు రాజమండ్రి డీఎస్పీ రమేష్ బాబు.
2015 నుండి హోమియోపతి కళాశాల లెక్చలర్ ను వేధింపులు గురి చేసిన కేసులో ముద్దాయిగా ఉన్న దీపక్ ను. 2019లో కిమ్స్ హాస్పిటల్ లో ఉద్యోగంలోకి ఎలా తీసుకున్నారనేది ప్రశ్నార్థకం. అంచెలించులుగా ఏజీఎం స్థాయికి ఎదిగిన దీపక్. నేరచరిత్ర తెలియదని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. కిమ్స్ హాస్పటల్ యాజమాన్యానికి డాక్టర్లకు అన్నీ తెలిసే కప్పిపుచ్చుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తున్నామని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. అయితే బాధితురాలు ఒక్కరితే ఇంజక్షన్ చేసుకుందాం మరి ఎవరైనా చేశారా, దీనికి సంబంధించి ఆరోజు ఏం జరిగిందో సీసీ కెమెరా విజువల్స్. పోలీసులు సేకరించినట్లు చెప్తున్నారు. ఈ కేసులో ఇంకా పలు అనుమానాలకు తావిస్తోంది. నాగాంజలితో పాటు ఉండే ముగ్గురు రూమ్ మెట్స్ ఘటన తర్వాత రోజునుండి కనిపించకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరిగినా కిమ్స్ హాస్పిటల్ వర్గాలు తమకు ఏమీ తెలియదని చెప్పడంపై అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటికీ పోలీస్ దర్యాప్తులో సమాధానాలు లభిస్తాయో లేదో చూడాలి మరి..