వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ వినియోగం పై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.. డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయాలని.. ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఆరోగ్య శ్రీ, దిశ యాప్‌లు ఉండాలని.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు
కొత్త మెడికల్ కాలేజీల వల్ల రాష్ట్రంలో అదనంగా 2,100 ఎంబీబీఎస్ సీట్లు వస్తాయన్నారు సీఎం జగన్.. ప్రస్తుతం ఉన్న 2185 మెడికల్ సీట్లకు ఇవి అదనంగా వెల్లడించారు.. ఈ విద్యాసంవత్సంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో తరగతులు ప్రారంభం అవుతాయని.. ఈ ఐదు కాలేజీల ద్వారా 750 సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు
COVID 19 : మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.. కేంద్రం సూచనలతో ఆయా రాష్ట్రాలకు కూడా ఎలాంటి పరిస్థితి విచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్నాయి.. అందులో భాగంగా ఇవాళ సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టిన ఆయన.. కోవిడ్ తాజా పరిస్థితిపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. కరోనా వ్యాపిస్తుందన్న…
Harish Rao: వైద్యం కోసం వచ్చిన రోగులను పట్టించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని వైద్యులు, సిబ్బందికి మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Hyderabad : క్షయ వ్యాధిపై హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ యుద్ధం ప్రకటించింది. ఎక్కడైనా క్షయ వ్యాధిగ్రస్తులు కనిపిస్తే సమాచారం అందించాలని నగరవాసులకు పిలుపు నిచ్చింది.
కరోనా ప్రారంభమైన తర్వాత ఈ మధ్యే ఏపీలో జీరోకు పడిపోయాయి కోవిడ్ కేసులు.. అయితే, దేశవ్యాప్తంగా మళ్లీ రోజువారి కేసులు పెరగడం మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.. మరోవైపు, కోవిడ్ పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ సమావేశం నిర్వహించారు.. క్యాంప్ కార్యాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాజాగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న…
వైద్యులకు యూజీసీ నిబంధనల మేరకు పీఆర్సీని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు సీఎం కేసీఆర్.. వైద్య రంగాభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులను భారీగా పెంచామన ఆయన.. వైద్యశాఖలో 21,073 పోస్టులను కొత్తగా మంజూరు చేశామన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా సూపర్ స్పెషలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేస్తున్నాం.. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం.. వాటికి నిర్మాణ పనులు చేస్తున్నాం అన్నారు.. ఇక, యూజీ, పీజీ, సూపర్ స్పెషలిటీ వైద్య సీట్ల పెంపు, నర్సింగ్…
వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్… కోవిడ్ 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, మెడికల్ కాలేజీలు, హెల్త్ హబ్స్‌పై చర్చించారు.. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్‌కాలేజీల నిర్మాణ ప్రగతిపై ఆరా తీసిన ఆయన.. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు వైద్యంకోసం వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని.. మన రాష్ట్రంలోనే అన్ని వ్యాధులకు చికిత్స అందించే విధంగా ఉండాలని స్పష్టం చేశారు సీఎం…
వైద్యారోగ్య శాఖపై కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ సేవలపై నిషేధం విధించాలని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ లేదా ప్రైవేట్ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది.. వైద్యారోగ్య శాఖలో కొత్తగా చేపట్టనున్న 14 వేలకు పైగా పోస్టుల భర్తీలో ఈ నిబంధనను కచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. డీఎంఈ, ఏపీవీవీపీ, డీపీహెచ్ సెంటర్లలో మొత్తంగా 14,037 పోస్టుల భర్తీకి ప్రణాళికలు…