CM YS Jagan: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష.. అదనంగా 2,100 ఎంబీబీఎస్ సీట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పలు అంశాలపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా సిబ్బంది లేరనే మాట రాకూడదన్న ఆయన.. క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిట్ చేయాలన్నారు.. మౌలిక సదుపాయాలు, మందులు కూడా సరిపడా ఉండేలా చూసుకోవాలని.. ప్రతి సమీక్షా సమావేశంలో కూడా సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానిపై వివరాలు సమర్పించాలంటూ ఆదేశించారు.. ఇక, కోవిడ్ తాజా పరిస్థితులపై సీఎంకు వివరాలను అందించారు అధికారులు.. రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా అదుపులో ఉందని.. గత వారంరోజుల్లో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో రాష్ట్రం 23 స్థానంలో ఉందన్నారు.. ఇక, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ప్రస్తుతం 24 మందిగా ఉందని వెల్లడించారు.
Read Also: Tuni Train Burning Case: తుని రైలు దగ్ధం కేసును కొట్టివేసిన కోర్టు.. వారిపై చర్యలకు ఆదేశాలు
Also Read
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
మరోవైపు.. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు సీఎం జగన్.. గ్రామాల విజిట్స్ లో వైద్యులు ఎస్‌ఓపీ కచ్చితంగా అమలు కావాలన్న ఆయన.. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 6వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 20,25,903 మందికి సేవలు అందించాయం.. 10,032 గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు అందించారని తెలిపారు. ఇక, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయాలని ఆదేశించారు సీఎం జగన్.. ఎవరికి సమస్య ఉన్నా వారికి వెంటనే పరీక్షలు చేయించాలన్న ఆయన.. నెల, రెండు నెలలకోసారి ఈ పరీక్షలు జరగాలన్నారు.. దీనిపై కార్యాచరణ చేసి తనకు నివేదించాలని ఆదేశించారు.
ఇక, రక్తహీనత, పౌష్టికాహార లేమిని పూర్తిగా నివారించాలని పేర్కొన్నారు సీఎం జగన్.. విలేజ్ క్లినిక్స్ ద్వారా వీటిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్న ఆయన.. రక్తహీనతతో బాధపడుతున్న గర్భవతులకు తప్పనిసరిగా పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. మరోవైపు.. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు.. కొత్త మెడికల్ కాలేజీల వల్ల రాష్ట్రంలో అదనంగా 2,100 ఎంబీబీఎస్ సీట్లు వస్తాయన్నారు.. ప్రస్తుతం ఉన్న 2185 మెడికల్ సీట్లకు ఇవి అదనంగా వెల్లడించారు.. ఈ విద్యాసంవత్సంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో తరగతులు ప్రారంభం అవుతాయని.. ఈ ఐదు కాలేజీల ద్వారా 750 సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?