మళ్లీ వేడెక్కిన మేడ్చల్ జిల్లా టీఆర్‌ఎస్ రాజకీయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఫామ్‌లోకి వచ్చిన ఆ మంత్రికి సొంతపార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారా? జిల్లాస్థాయి కీలక పదవిలో ఉన్న నేత రాజీనామాకు సిద్ధపడ్డారా? ప్రతిపక్ష పార్టీల విషయంలో చేయాల్సిన రాజకీయాలు సొంతపార్టీలో చేసి అధిష్ఠానాన్ని ఇరుకున పెడుతున్నారా?
కమిటీల కూర్పుతో మరోసారి భగ్గుమన్న విభేదాలు!
Also Read
టీఆర్ఎస్ సంస్థాగత కమిటీల కూర్పు.. ప్రకటనలు కొన్నిచోట్ల ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా నేతల రాజీనామాల వరకు వివాదాలు వెళ్తున్నాయి. దీనికి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఘట్‌కేసర్ మండల కమిటీ ఒక ఉదాహరణ. కమిటీ కూర్పు.. మంత్రి మల్లారెడ్డి, జడ్పీ ఛైర్మర్ శరత్‌చంద్రారెడ్డి మధ్య చిచ్చుపెట్టింది. చాలా రోజులుగా కొనసాగుతున్న విభేదాలు ఈ విధంగా భగ్గుమన్నాయి.
మంత్రి మల్లారెడ్డి తీరుపై జడ్పీ ఛైర్మన్ గుర్రు!
మండల కమిటీ ఏర్పాటుపై శరత్‌చంద్రారెడ్డి మనస్తాపం చెందారట. పార్టీ పెద్దల ఆదేశాలతో కొంతమంది టీఆర్‌ఎస్ నాయకులు జడ్పీ చైర్మన్ వద్దకు మంత్రి తరఫున వెళ్లి మంతనాలు జరిపారట. ఆ తర్వాత శరత్ చంద్రారెడ్డి చల్లబడినట్టు సమాచారం. మంత్రి మల్లారెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని జడ్పీ ఛైర్మన్ వర్గం గుర్రుగా ఉంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుతం గ్రామ, మండల స్థాయిలో టీఆర్‌ఎస్ కమిటీలు వేస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన నాయకులకు తెలియకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా మంత్రి కమిటీల నియామకం చేపడుతున్నట్టు సొంత పార్టీ నేతల ఆరోపణ. అదే అసంతృప్తి రూపంలో భగ్గుమంటోంది.
మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని మంత్రి పక్కన పెట్టేశారా?
అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సహకారం తీసుకుంటానని చెప్పిన మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేశారట. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తనయుడే శరత్ చంద్రారెడ్డి. పార్టీ కమిటీ ఏర్పాటులో తమ సొంత మండలంలో తమకు తెలియకుండా టీఆర్ఎస్ కమిటీ వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పైగా సుధీర్‌రెడ్డి వ్యతిరేకులను మంత్రి చేరదీస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పైగా ఘట్‌కేసర్ మండలంలో జడ్పీచైర్మన్ వర్గానికి పార్టీ, ప్రభుత్వ పరంగా సహకరించడం లేదట. ఇప్పుడు టీఆర్‌ఎస్ కమిటీల కూర్పులోనూ జడ్పీ ఛైర్మన్ అనుచరులకు చోటు కల్పించకపోవడంతో విభేదాలకు మరింతగా ఆజ్యం పోసినట్టు అయింది.
రాజీనామాకు సిద్ధపడ్డ శరత్ చంద్రారెడ్డి?
టీఆర్ఎస్ కమిటీలతో విభేదాలు ముదురుపాకాన పడటంతో త్వరలోనే అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట జడ్పీ ఛైర్మన్. మంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతూ పదవికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న పార్టీ పెద్దలు తమకు రెండు రోజులు సమయం ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కోరినట్టు సమాచారం. దాంతో ఆయన డైలమాలో పడ్డారట. ప్రస్తుతం మేడ్చల్ టీఆర్ఎస్‌లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. మరి.. ఈ ఎపిసోడ్‌కు ఎలాంటి ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!