హైదరాబాద్ లో వీకెండ్ వచ్చిందంటే చాలు కుర్రకారు రెచ్చిపోతోంది. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ లారీని ఢీకొట్టారు యువకులు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధి బౌరంపేటలో ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ఢీకొంది కారు. దీంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద అర్ధరాత్రి తర్వాత ఘటన జరిగింది.
READ ALSO దూసుకొచ్చిన కారు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ లారీని ఢీకొట్టారా యువకులు. ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు పోలీసులు. కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన అశోక్‌ను సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, విజయవాడ వాసులుగా గుర్తించారు. మృతులు చరణ్(విజయవాడ), సంజూ, గణేశ్(ఏలూరు)గా గుర్తించారు. నిజాంపేట్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ యువకులు. ప్రమాద సమయంలో చరణ్ డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసుల వెల్లడించారు. నలుగురు యువకులు మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన అశోక్(ఏలూరు) పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదం విషయం బాధితుల కుటుంబాలకు తెలియచేసే పనిలో వున్నారు పోలీసులు.