Off The Record: తెలంగాణ బీజేపీలో సంస్థాగత ఎన్నికలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకా అడపా దడపా కొన్ని చోట్ల స్థానిక కమిటీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అదేమంత పెద్ద విషయం కాదు. కానీ… ఇంకొక్క విషయంలో మాత్రం పీటముడి గట్టిగానే బిగుసుకుపోయినట్టు కనిపిస్తోంది. పార్టీకి సంస్థాగతంగా 38 జిల్లాలు ఉంటే… 36 చోట్లే అధ్యక్ష ఎన్నిక పూర్తయింది. ఆయా జిల్లాల్లో కమిటీలు కూడా దాదాపుగా పడ్డాయి. ఇక అనుబంధ కమిటీలు, అధికార ప్రతినిధుల నియామకం కూడా త్వరలోనే…
HMDA: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విలువైన భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) తాజాగా ఈ-వేలం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజాల్ లేఅవుట్‌లో మొత్తం 12 ప్లాట్లు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని బాచుపల్లి లేఅవుట్‌లో 70 ప్లాట్లు, అలాగే రంగారెడ్డి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 4 ప్లాట్లు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో మరో 7 ప్లాట్లు వేలం ద్వారా అమ్మకానికి ఉంచనున్నట్లు హెచ్ఎండీఏ…
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పరమ పవిత్రమైన కీసరగుట్ట శ్రీభవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న లింగాలకుంటలో కొందరు గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం త్రవ్వకాలు చేపట్టిన ఆనవాళ్లు కనిపించాయి. స్వామివారి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న లింగానికి పూజలు చేసి గుప్త నిధుల కోసం కొన్ని అడుగుల మేరకు త్రవ్వకాలు జరిపారు. గుప్తనిధుల కోసం త్రవ్వకాలు జరిపారనే ఆనవాళ్లుగా అక్కడే ఓ మట్టికుండ, ఎర్రని గుడ్డ, పసుపు, నీళ్ళ బాటిల్ కనిపించడం పలు…
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లి పియస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు వయసు 25 నుంచి 35 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్పుడప్పుడు పుంజుకున్నప్పటికీ, 2024లో చాలా వరకు నిరాశాజనకమైన గణాంకాలను చూపుతోంది. నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ , తెలంగాణా యొక్క రిజిస్ట్రేషన్ , స్టాంపుల శాఖ ప్రకారం , హైదరాబాద్‌లో చాలా సంవత్సరాలుగా ఆస్తి రిజిస్ట్రేషన్లు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి.
హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ సంవత్సరానికి 25% (YoY) పెరిగింది . అక్టోబర్ 2023లో 5,787 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది..నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. ఏడాది ప్రాతిపదికన 25% పెరుగుదల గమనించబడింది. నెలలో నమోదైన ఆస్తుల మొత్తం విలువ 3,170 కోట్లు గా ఉంది. ఇది కూడా 41% పెరిగింది, ఇది అధిక విలువ ఉన్న గృహాల అమ్మకం వైపు మొగ్గు చూపిస్తుంది.. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్‌లో హైదరాబాద్,…
గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. శుక్రవారం ఉదయమే గణేష్ శోభాయాత్రం ప్రారంభం కానుంది… వేల సంఖ్యలో గణనాథులు తరలివచ్చి.. హుస్సేన్‌సాగర్‌లో గంగమ్మ ఒడికి చేరనున్నారు.. అయితే, ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.. ఇదే సమయంలో.. భాగ్యనగరంలో రెండ్రోజులు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. గణేశ్ నిమజ్జనం దృష్ట్యా మద్యం అమ్మకాలపై పోలీసు శాఖ ఆంక్షలు విధించింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల…
హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా రేపు గణేష్ నిమజ్జనం సాగనుంది.. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తూనే ఉన్నారు భక్తులు.. అయితే, హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది… మహా నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కూడా గణపయ్యకు బైబై చెప్పే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు.. అయితే, ఈ సందర్భంగా అందరికీ శుభవార్త వినిపించిన ప్రభుత్వం.. మందు బాబులకు మాత్రం బ్యాడ్ న్యూస్ చెప్పింది… వినాయక నిమజ్జనం సందర్భంగా… శుక్రవారం రోజు రంగారెడ్డి,…
గెయిల్ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కొత్త భరోసా సెంటర్ ఏర్పాటు కోసం గెయిల్ ఇండియా లిమిటెడ్ మరియు భరోసా సొసైటీ మధ్య అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. మహిళా భద్రతా విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా, డీఐజీ బి సుమతి, భరోసా టెక్నికల్ డైరెక్టర్ మమతా రఘువీర్, గెయిల్ ఇండియా లిమిటెడ్ ZGM శరద్ కుమార్ తదితరుల సమక్షంలో మంగళవారం ఎంఓయూపై సంతకాలు జరిగాయి.…