గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. శుక్రవారం ఉదయమే గణేష్ శోభాయాత్రం ప్రారంభం కానుంది… వేల సంఖ్యలో గణనాథులు తరలివచ్చి.. హుస్సేన్‌సాగర్‌లో గంగమ్మ ఒడికి చేరనున్నారు.. అయితే, ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.. ఇదే సమయంలో.. భాగ్యనగరంలో రెండ్రోజులు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. గణేశ్ నిమజ్జనం దృష్ట్యా మద్యం అమ్మకాలపై పోలీసు శాఖ ఆంక్షలు విధించింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో.. మద్యం షాపులు మూతపడనున్నాయి.. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు పోలీసు అధికారులు..
Read Also: Hyderabad Metro Rail: అర్ధరాత్రి 2 గంటల వరకు హైదరాబాద్ మెట్రో సేవలు..