మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పరమ పవిత్రమైన కీసరగుట్ట శ్రీభవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న లింగాలకుంటలో కొందరు గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం త్రవ్వకాలు చేపట్టిన ఆనవాళ్లు కనిపించాయి. స్వామివారి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న లింగానికి పూజలు చేసి గుప్త నిధుల కోసం కొన్ని అడుగుల మేరకు త్రవ్వకాలు జరిపారు. గుప్తనిధుల కోసం త్రవ్వకాలు జరిపారనే ఆనవాళ్లుగా అక్కడే ఓ మట్టికుండ, ఎర్రని గుడ్డ, పసుపు, నీళ్ళ బాటిల్ కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Also Read:Atchannaidu: ప్రభుత్వం మీద తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు.. అచ్చెన్నాయుడు వార్నింగ్..
సాక్షాత్తు శ్రీరామచంద్రుడు పూజలు జరిపి ప్రతిష్టించాడని చెప్పుకుంటున్న శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి పురాతన కాలం నుంచి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కీసరగుట్టలో గుప్తనిధుల కోసం త్రవ్వకాలు ఇంతకు ముందు కూడా పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మళ్లీ గుప్తనిధులకోసం త్రవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. ఇంతవరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. గుప్తనిధులకోసం త్రవ్వకాలు జరిపిన ఆనవాళ్లు నిజమయితే వెంటనే అధికారులు పట్టించుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు పలువురు.