గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం శామీర్ పేట్ పెద్ద చెరువును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సందర్శించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అన్ని శాఖల అధికారులకు సూచనలు ఇచ్చారు.
HYDRA: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్‌లో శ్మశాన వాటికలపై జరిగిన అక్రమ కబ్జాలను తొలగించేందుకు అధికారులు విస్తృతంగా చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున నుంచే హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రారంభించారు. పర్వతాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 1, 12లో ఉన్న ముస్లిం , క్రిస్టియన్ శ్మశాన వాటికలపై కొంతకాలంగా భూకబ్జాదారులు కబ్జా చేసి, అక్రమంగా నిర్మాణాలు చేపట్టి అమ్మకాలు నిర్వహించినట్లు సమాచారం. గత రెండు ఏళ్లుగా…
నేడు తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం దాదాపు 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్టియర్‌లో 66.89 శాతం, ద్వితీయ సంవత్సరంలో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా.. ఈ ఏడాది కూడా బాలికలదే…
కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చెల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ గా గుర్తించారు. జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూయించారు. ఫొటోను చూసిన యువతి.. రైలులో తన పై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని గుర్తు పట్టింది. ఏడాది క్రితమే మాహేశ్ భార్య అతన్ని వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. గంజాయికి బానిసైన మహేశ్ పాత నేరస్తుడు. ప్రస్తుతం పోలీసుల…
ఉదయం ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. 25 ఏళ్ల జీవితంలో ఎవరిపై చేయి చేసుకోలేదని ఈటల అన్నారు. కానీ ఈ రోజు న్యాయం కోసం చేయి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
Etela Rajender : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారంలో ఉద్రిక్తత నెలకొంది. పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలానగర్‌లో జరిగింది, దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బాధితులు, రియల్ వ్యాపారులు పేదల భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారన్న విషయాన్ని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఈటల,…
Ponguleti Srinivas Reddy : ప్రజలకు మరింత మెరుగైన సేవల కోసం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పునఃవ్యవస్థీకరణ చేస్తున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో శాశ్వత భవనాలు ఏర్పాటు చేస్తున్నట్లు, మొదటి దశలో నాలుగు జిల్లాల్లో నిర్మాణ చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గచ్చిబౌలిలో మోడల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో శాశ్వతంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మిస్తామన్నారు. అవసరమైన భూములను…
మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. మృతులు రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన ఒకే కుటుంబంగా గుర్తించారు. తండ్రి కృష్ణ రైల్వే లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అయితే.. ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో పిల్లలను వెంట తీసుకుని వెళ్లాడు. తండ్రి కృష్ణ పిల్లలను ట్రాక్‌పై కూర్చోబెట్టి పని చేస్తున్నాడు. ఇంతలోనే ట్రాక్‌పైకి ట్రైన్ రావడంతో పిల్లలను కాపాడబోయాడు. కానీ.. వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.
కీసర పోలీస్ స్టేషన్ పరిధి యాదగిరి పల్లిలోని ఓ ఫాం హౌజ్ లో సందీప్ రెడ్డి అనే యువకుడు అనుమానస్పాద మృతిచెందాడు. నిన్న సాయంత్రం యాదగిరి పల్లిలోని ఫాం హౌజ్ కి స్నేహితులు వచ్చారు.