DCP Kotireddy : గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం శామీర్ పేట్ పెద్ద చెరువును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సందర్శించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అన్ని శాఖల అధికారులకు సూచనలు ఇచ్చారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా మొదటి రోజు నుంచి శామీర్ పేట్ పెద్ద చెరువులో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం శామీర్ పేట్ పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన కార్యక్రమాలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సందర్శించారు. శనివారం నాటికి సుమారు 4 వేల 600 వరకు గణేష్ నిమజ్జనాలను చేసుకోవడం జరిగిందని చెప్పారు. షిఫ్టుల వారిగా పోలీసు సిబ్బంది చెరువు వద్ద విధులు నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులు కూడా పోలీసులకు సహకరించి నిమజ్జన లను ప్రశాంతంగా జరుపుకున్నారని డీసీపీ తెలిపారు.
Kakinada : వంగవీటి రంగ విగ్రహ వివాదంపై కాకినాడ కలెక్టర్‌తో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గణేష్ నిమజ్జనాల సందర్భంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించడం జరిగిందని కరెంట్ ఏడిఈ అశోక్ రావు తెలిపారు. గత పది రోజులుగా పోలీసు, మున్సిపల్ సిబ్బంది, వైద్య శాఖకు అందుబాటులో ఉండి ఎవరికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకున్నామన్నారు. గణేష్ శోభయాత్రలో భక్తులు తెచ్చే గణనాధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామన్నారు. దీనికి సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ లు కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఏసీపీ లు బాల గంగిరెడ్డి, వెంకట్ రెడ్డి, సీఐ లు శ్రీనాథ్, గురవయ్య, మధుసూదన్, రాజు, లైన్ ఇన్స్పెక్టర్ యాదగిరి, అసిస్టెంట్ వంశీకృష్ణ, లైన్మెన్ నరసింహ, ఆర్టీసీఎన్ నజీర్ ఖాన్, ఆర్టీసీఎన్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Digital Fasting: బాసు డిజిటల్ ఉపవాసం తెలుసా.. ఎందుకైనా మంచిది ఓ లుక్ వేయండి