నేడు తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం దాదాపు 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్టియర్‌లో 66.89 శాతం, ద్వితీయ సంవత్సరంలో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా.. ఈ ఏడాది కూడా బాలికలదే పై చేయి.
READ MORE: Om Prakash Murder: భర్తను చంపేముందు గూగుల్‌లో మాజీ డీజీపీ భార్య ఏం వెతికిందంటే ..!
అలాగే.. తాజా ఫలితాల్లో ఏ జిల్లా ముందంజలో ఉందో ఇంటర్ బోర్డు ప్రకటించింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 77.21 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది.. 48.43 శాతంతో మహబూబాబాద్ జిల్లా చివరి స్థానానికి పడిపోయింది. ద్వితీయ సంవత్సరంలో ములుగు జిల్లా 80.12 శాతంతో టాప్‌లో ఉండగా.. కామారెడ్డి జిల్లా 54.93శాతంతో చివరి స్థానానికి పరిమితమైంది.
READ MORE: Andhra Pradesh: ఏం చదువులు ఇవి..? టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని..