Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2026 నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అప్పుడే భారీ స్థాయిలో కసరత్తును ప్రారంభించింది. రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ వనదేవతల జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహా క్రతువును ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి మాసంలో నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఈ జాతరలో…