మేడారం జాతర పనులను వేగవంతం చేయాలని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ర్ట శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గురువారం జాతర ఏర్పాట్లను జంపన్న వాగు వద్ద నిర్మించిన స్నాన ఘట్టాలను, షెడ్లను, ఇతరపనులను అటవీ పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణను రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో కన్నా…
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచి మేడారం జాతరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అసియాలోనే అతిపెద్ద జాతరగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఈ జాతరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం జాతర కొరకు ప్రత్యేకంగా 3,845 బస్సులను ఏర్పాటు…
కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అయింది. కరోనా తగ్గిందనుకునేలోపే ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. మేడారంకి ముందస్తు మొక్కుల కోసం వస్తున్న వాళ్ళను కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. టీకా వేసుకున్న వారికే వనదేవతల దర్శనానికి అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేళ్లకు ఒక్కసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతరకు అప్పుడే జనం తాకిడి పెరిగింది. కరోనా థర్డ్ వేవ్ వస్తుంది అని జరుగుతున్న ప్రచారం నేపథ్యం…
తెలంగాణలో రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క -సారలమ్మ జాతరకు ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు భారీ స్థాయిలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర జరగనుంది. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా మేడారం జాతరకు పేరుంది. ఈ జాతర నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులు విడుదల చేసింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని…